గీతాసింగ్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే.ఈ ఘటనతో గీతా సింగ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సరిగ్గా రెండేళ్ల క్రితం చేతికి అందివచ్చిన కుమారుడిని కోల్పోయిన గీతాసింగ్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. అయితే కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించిన ఆమె చాలా ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.
సినిమాల సంగతి పక్కన పెడితే.. సుమారు రెండేళ్ల క్రితం గీతా సింగ్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె కుమారుడు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. అసలు పెళ్లే చేసుకోని గీతాసింగ్ కు కుమారులు ఎక్కడి నుంచి వచ్చారనుకుంటున్నారా? ఆమె తన సోదరుడి కుమారులను దత్తత తీసుకుని వారి బాగోగులను చూసుకుంటున్నారు.
అయితే రెండేళ్ల క్రితం పెద్దబ్బాయి రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. ఇప్పుడిప్పుడే ఈ విషాదం నుంచి కోలుకుంటోన్న ఆమె లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను పంచుకున్నారు. అలాగే బిగ్‌బాస్ షోపై తన ఆసక్తిని వెల్లడించారు. ’24 ఏళ్లు ప్రాణంగా పెంచుకున్న నా కొడుకు యాక్సిడెంట్‌లో చనిపోయాడు. తట్టుకోలేకపోయాను.
అప్పుడు నా దగ్గర ఎవరూ లేరు. కనీసం తిన్నావా? లేదా? ఎలా ఉన్నావు? అని అడిగేవాళ్లే లేరు. నాకు నేనే ధైర్యం చెప్పుకుని బతికాను. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా ఆ బాధ నుంచి బయటపడుతున్నాను. అన్నయ్య రెండో కొడుకును కూడా నేనే చూసుకుంటున్నాను. అలాగే కజిన్ అన్నయ్య కూతురు కూడా నా దగ్గరే పెరుగుతోంది. ఈ పిల్లల కోసమే నేను పెళ్లి చేసుకోకుండా ఉన్నాను’