కుల వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న కొందరు పేద గౌడన్నలు ఎండిన తాటి, ఈత వనాలతో కల్లు రాక బతుకులీడుస్తున్నారు. చాలీచాలని ఆదాయంతో కొందరికి రెండు పూటలా తిండి దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇక వారు చేసే రిస్క్ గురించి ఎంత తక్కువ చెబితే అంత బెటర్. తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ఓ గీత కార్మికుడు కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కాడు.
అయితే తాజాగా మీ ముందుకు ఓ క్రేజీ వీడియోను తీసుకొచ్చాం. ఇందులో ఓ గీత కార్మికుడు కల్లు కుండ దించేందుకు తాటి చెట్టు పైకి ఎక్కాడు. ఒక కుండ నుంచి కల్లు దింపేందుకు ప్రయత్నించాడు. అయితే అందులో అనూహ్య రీతిలో ఓ అనుకోని అతిథి దర్శనిచ్చింది. దీంతో అవాక్కవ్వడం ఆ గీత కార్మికుడి వంతయ్యింది.
ఇంతకీ ఆ అతిథి ఎవరు అనకుంటున్నారా…? ఉడుము.. అవును ఆ కుండలో ఓ ఉడుము ఉంది. ఉడుములు తాటి చెట్లు ఎక్కి కుండల్లోని కల్లు తాగుతాయని పలువురు గౌడ సోదరులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు అడపా దడపా జరుగుతాయ్ అంటున్నారు. కాగా ఈ వీడియోకు నెటిజన్స్ ఓ రేంజ్‌లో కామెండ్స్ పెడుతున్నారు. కల్లు పోతే పోయింది.. కూర వండేందుకు మంచి ఉడుము దొరికిందిగా అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. అయితే ఉడుమును చంపి తినడం నేరం.
ఉడుములు కూడా పులులు, నెమళ్ల జాబితాలోని షెడ్యూల్ వన్ కేటగిరీలోకి చేరాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. అరుదైన వన్యప్రాణులు అంతరించిపోతుండడం, వన్యప్రాణుల వేట పెరిగిపోతున్న నేపథ్యంలో.. వారి పరిరక్షణ కోసం అటవీ చట్టాలు మరింత కఠినతరం చేశారన్నారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం ఉడుమును చంపడం నేరమని, వన్యప్రాణుల్ని చంపినా, వాటిని కొనుగోలు చేసినా చట్టరీత్యా శిక్షలు తప్పవు.