వృద్ధురాలు గొంతులో గారెముక్క ఇరుక్కుపోయింది. దాంతో ఆమె ఊపిరాడక తల్లడిల్లిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సాయంత్రం సమయంలో పెద్ద కొడుకు కుటుంబ సభ్యులు గమనించగా అప్పటికే ఆమె చనిపోయింది. అయితే గొంతులో గారె ముక్క ఇరుక్కునిపోయి ఊపిరాడక ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలి కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
జిల్లాలోని తల్లాడకు చెందిన మొక్కా తిరుపతమ్మ అనే 80ఏళ్ల వృద్ధురాలికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. కానీ, తిరుపతమ్మ ఎవరి వద్ద ఉండటం లేదు.. కానీ, పెద్ద కుమారుడు రామకృష్ణ ఇంటికి సమీపంలోనే ఓ చిన్న గదిలో ఆమె ఒంటరిగా ఉంటుంది. అయితే, సంక్రాంతి పండగ సందర్భంగా అదే గ్రామంలో ఉండే చిన్న కుమారుడు శ్రీను బుధవారం మధ్యాహ్నం తల్లి వద్దకు వచ్చి గారెలు ఇచ్చివెళ్లాడు.
వాటిని తినే క్రమంలో వృద్ధురాలు గొంతులో గారెముక్క ఇరుక్కుపోయింది. దాంతో ఆమె ఊపిరాడక తల్లడిల్లిపోయిన తిరుపతమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సాయంత్రం సమయంలో పెద్ద కొడుకు కుటుంబ సభ్యులు గమనించగా అప్పటికే ఆమె చనిపోయింది. కుమార్తె ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్టు తల్లాడ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు తెలిపారు.