నవరాత్రి వేడుకలు అంటే దుర్గా పూజ, ఉపవాసం, రావణుడి దహనం మాత్రమే కాదు గర్భా నృత్యం, దాండియా కూడా ఉంటాయి. ఇవి లేకుండా నవరాత్రి ఉత్సవాలు అసంపూర్ణంగా అనిపిస్తాయి. గుజరాత్ లో శరన్నవరాత్రి ఉత్సవాల్లో తప్పనిసరిగా ఈ నృత్యాలు ఆడతారు. అయితే నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఎంతో వేడుకగా జరుగుతున్నాయి. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా వేడుకలో పాల్గొంటున్నారు. ప్రతి రోజూ సాయంత్ర వేళ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాల్లో గర్భా, దండియా నృత్యాలు చేస్తూ ఆనందంగా గడుపుతున్నారు.
నవరాత్రి ఉత్సవాలు దేశాన్ని ఉర్రూతలూగిస్తున్న వేళ ఓచోట జరిగిన గర్భా ఉత్సవంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. నవరాత్రి ఉత్సవాల్లో గర్భా డ్యాన్స్ చేస్తూ ఓ కళాకారుడు కుప్పకూలి మృతి చెందాడు. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని పూణెలో సోమవారం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని పూణేలో గర్బా నిర్వహిస్తుండగా ప్రముఖ కళాకారుడు 54ఏళ్ల అశోక్ మాలీ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. కార్యక్రమంలో ఓ బాలుడితో కలిసి హుషారుగా గర్బా డ్యాన్స్ చేస్తున్న అతడు ఉన్నట్టుండి కూలిపోయాడు.
అతడికి గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలి మరణించాడు. ఈ హృదయ విదారక సంఘటనతో ఆనందోత్సవ వేడుకలపై నీలినీడలు కమ్మేసింది. ‘గర్బా కింగ్’ అని పిలవబడే గార్బా ట్రైనర్ అశోక్ మాలి ఆకస్మిక మరణంతో దాండియా, గర్బా సంతోషకర వాతావరణం చెదిరిపోయింది. అశోక్ మాలీ మరణంతో అక్కడి ప్రజలంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. గర్భా ఆడుతున్న క్రమంలో ఒక్కసారిగా ఆ వ్యక్తి శారీరక శ్రమ పెరుగుతుంది.
ఈ సమయంలో ఆక్సిజన్ అవసరం ఎక్కువవుతుంది. అధిక ఆక్సిజన్ వినియోగం ఊపిరితిత్తుల పనితీరును పెంచుతుంది. ఇది నేరుగా గుండె పనితీరును ప్రభావితం చేస్తుంది. గుండె వేగంగా రక్తాన్ని పంపింగ్ చేయడం ప్రారంభం అవుతుంది. దీంతో గుండె పై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. ఈ కారణంగా గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
7 Oct 24 : Actor Ashok Mali, affectionately known as the Garba King of Pune, tragically passed away during a Garba event in Chakan. While dancing to his beloved Garba, Ashok Mali suddenly collapsed due to a severe #heartattack2024 💉#LuciferShotWorking pic.twitter.com/llZ6ho3dJd
— Anand Panna (@AnandPanna1) October 8, 2024