భారీగా పెరిగిన గంగ‌వ్వ‌ పాపులారిటీ, గంగ‌వ్వ‌ ఆస్తి ఎన్ని కోట్లంటే..?

divyaamedia@gmail.com
1 Min Read

గంగ‌వ్వ‌కు న‌లుగురు పిల్ల‌లు ముగ్గురు కూతుర్లు ఒక కొడుకు, త‌న భ‌ర్త దుబాయ్ వెళ్లాడు కాని ఏమీ సంపాదించ‌లేదు. తాగుడుకు బానిసై అలాగే చ‌నిపోయాడు, అయితే గంగ‌వ్వ మాత్రం త‌న బిడ్డ‌ల‌ని పెంచి పెద్ద చేసింది, పెళ్లిల్లు చేసింది. అయితే తాజాగా ఆమె ఆస్తులు, సంపాదన గురించి మై విలేజ్‌ షో టీమ్‌ ఓ వీడియో రిలీజ్‌ చేసింది. అందులో గంగవ్వ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ (నాలుగో సీజన్‌) తర్వాత తన జీవితం చాలా మారిందంటూ తన ఇల్లు చూపించింది.

రియాలిటీ షో తర్వాతే కట్టుకున్న ఈ ఇంటికి రూ.22 లక్షలు అయిందని తెలిపింది. తనకు ఉన్న ఆవుల కోసం రేకుల షెడ్డు కూడా వేసినట్లు పేర్కొంది. అలాగే వాటి కోసం గడ్డిని కూడా పెంచుతోంది. వ్యవసాయ భూములు..ఆవుల్ని కొని, షెడ్డు నిర్మించడానికి మొత్తం రూ.3 లక్షలు అయిందని వివరించింది. తర్వాత తను కొన్న నాలుగున్నర గుంటల పొలాన్ని చూపించింది. దీని ధర ఇప్పుడు రూ. 9 లక్షలు. అలాగే మరో చోట ఉన్న రెండున్నర ఎకరాల పొలం చూపించింది.

ఇది దాదాపు రూ.75-80 లక్షలు పలుకుతోందట! ఇంకోచోట ఉన్న కమర్షియల్‌ ప్లాట్‌ చూపిస్తూ దీన్ని కొనడానికి సుమారు రూ.3 లక్షలయిందని పేర్కొంది. అదే తన కోరిక..మరో వ్యవసాయ భూమిని చూపిస్తూ.. ఇక్కడ 15 గుంటల భూమి ఉందని.. దీని విలువ ఏడెనిమిది లక్షల రూపాయలు ఉంటుందని తెలిపింది. మొత్తంగా తన ఇల్లు, వ్యవసాయ భూమి, కమర్షియల్‌ ప్లాట్స్‌ అంతా కలిపి కోటి 24 లక్షల విలువ చేస్తోంది.

తనకంటూ ఐదు తులాల బంగారం ఉందన్న గంగవ్వ ఎప్పటికైనా 50 ఆవులను తీసుకుని వాటిని పెంచుతూ, పాలమ్ముతూ బతకాలన్నదే తన కోరిక అని చెప్పుకొచ్చింది. ఇక తను సంపాదించినదాంట్లో కూతుర్లిద్దరికీ చెరో రూ.2 లక్షలు, మనవరాలి పెళ్లికి రూ.2.5 లక్షలు ఇచ్చాం.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *