రిలయన్స్ ఇండస్ట్రీస్ వారసుడు అనంత్ అంబానీ, రాధిక జంట గణపతి చందా ఎంతిచ్చారో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

నిమజ్జన వేడుకలో భాగంగా నీతా అంబానీ గణపతి విగ్రహాన్ని నిమజ్జన ప్రదేశానికి తీసుకు వేళ్లే క్రమంలో అలంకరించబడిన ట్రక్‌పై నిల్చున్నారు. ఆ క్రమంలో అంబానీ కుటుంబం వీధుల్లో ప్రజలకు స్వీట్లను పంచారు. ఈ సందర్భంగా రాధిక ఎంబ్రాయిడరీ మోడల్ నీలం రంగు డ్రెస్ ధరించగా, అనంత్ నారింజ రంగు కుర్తా పైజామా ధరించారు. ఈ కార్యక్రమంలో వీరిద్దరూ ఎంతో సంబంరంగా జేజేలు పలుకుతూ చప్పట్లతో వీధుల గుండా గణపతికి వీడ్కోలు పలికారు. దీనికి ముందు కొత్తగా పెళ్లయిన ఈ జంట అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ భార్యాభర్తలుగా కలిసి గణపతికి తమ మొదటి హారతి ఇచ్చారు. మరుసటి రోజు ఆనందంతో గణేశుడికి వీడ్కోలు పలికారు.

అయితే భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కూడా ప్రతిఏటా వినాయక చందా ఇస్తారు. ప్రపంచంలోని టాప్ శ్రీమంతుల్లో ఒకరైన ఆయన చందా ఇచ్చారంటే అది మినిమం కోట్లలో వుంటుందని అందరికీ తెలుసు. అంబానీ కుటుంబానికి ఈ వినాయక చవితి చాలా స్పెషల్. ఇటీవల అంగరంగ వైభవంగా జరిగిన వివాహబంధంతో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ కొత్త జీవితం ప్రారంభించారు. వీరు జంటగా జరుపుకుంటున్న తొలి వినాయక చవితి ఇది. కాబట్టి ఈసారి పండగ జీవితాంతం గుర్తిండిపోయేలా జరుపుకుంటోంది అంబానీ కుటుంబం… అందుకోసం కోట్లాది రూపాయలను ఖర్చుచేసింది. సాధారణంగానే అంబానీ కుటుంబానికి దైవభక్తి ఎక్కువ.

వారు నివాసముండే ముంబైలో వినాయక చవితి వేడుకలను అట్టహాసంగా జరుపుకుంటారు. ఈ వేడుకల్లో అంబానీ కుటుంబం కూడా పాల్గోంటుంది.ముంబైలోని లాల్ బాగ్ మహారాజా గణనాథుడిని అంబానీకి ప్రతిసారి భారీగా చందా ఇస్తుంటారు. అయితే ధన రూపంలో కాకుండా ఖరీదైన బహుమతుల రూపంలో కానుకలు సమర్పించి విఘ్ననాయకుడిపై భక్తిని చాటుకుంటుంది అంబానీ కుటుంబం. ఇటీవల అంబానీల ఇంట అట్టహాసంగా వివాహం జరిగింది. ముఖేష్, నీతా అంబానీ దంపతులు చిన్నకొడుకు అనంత్ అంబానీ, ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన రాధిక మర్చంట్ ను పెళ్లాడాడు. కేవలం భారతీయులే కాదు యావత్ ప్రపంచమే ఆశ్చర్చపోయేంత గణంగా వీరి పెళ్లి జరిగింది. ఇలా మూడుముళ్ళ బందంతో ఒక్కటైన అనంత్‌-రాధిక జంటగా జరుపుకుంటున్న వినాయక చవితి ఇది.

ఈ వినాయక చవితి అనంత్, రాధిక దంపతులకు చాలా ప్రత్యేకమైనది. దీంతో ఆ గణనాథుడికి భారీ కానుక ఇచ్చి పండగను మరింత ప్రత్యేకంగా మార్చుకున్నారు ఈ నవ దంపతులు. ముంబైలోని లాల్ బాగ్ గణేషుడికి అనంత్ అంబానీ భారీ విరాళం ప్రకటించారు. ఏకంగా 20 కిలోల బంగారు కిరీటాన్ని ఈ గణనాథుడి అలంకరణ కోసం అందించారు అనంత్ అంబాని. అనంత్-రాధిక దంపతులు ముందునుండే లాల్ బాగ్ వినాయకుడికి బంగారు కిరీటం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ కిరీటం తయారీకి సమయం పడుతుంది కాబట్టి రెండు నెలల క్రితమే పనులు ప్రారంభించారు. ప్రత్యేకంగా బంగారు ఆభరణాలను తయారుచేసే స్వర్ణకారులతో ఈ కిరీటం చేయించారు. ఈ బంగారు కిరీటం విలువు రూ.15 కోట్లు వుంటుందని అంచనా.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *