2001 లో జగపతి బాబు కథానాయకుడిగా వచ్చిన నాలో ఉన్న ప్రేమ అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె తర్వాత స్టూడెంట్ నంబర్ 1, కలుసుకోవాలని, తొట్టిగ్యాంగ్, అల్లరి రాముడు తదితర చిత్రాల్లో నటించింది. 2002 లో ఆత్మహత్యా ప్రయత్నం చేసి చావు నుంచి బయట పడింది. తెలుగుతోపాటు కొన్ని తమిళ, మలయాళ చిత్రాలలో నటించి ఆకట్టుకుంది ఈ భామ. ఈ బ్యూటీ 2001లో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంది.
అయితే జగపతి బాబు హీరోగా నటించిన నాలో ఉన్న ప్రేమ అనే సినిమాతో పరిచయం అయ్యింది అందాల భామ గజలా . ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. ఇక ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత కలుసుకోవాలని, తొట్టిగ్యాంగ్, అల్లరి రాముడు సినిమాల్లో నటించింది. గజాల హీరోయిన్ గా చివరిగా జానకి వెడ్స్ శ్రీరామ్ అనే సినిమాలో నటించింది. వెంకటేష్ హీరోగా నటించిన మల్లీశ్వరి సినిమాలో గెస్ట్ రోల్ చేసింది.
అయితే ఈ అమ్మడు 2002లో ఆత్మహత్యా ప్రయత్నం చేసి చావు నుంచి బయట పడింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. మస్కట్‌లో జన్మించిన ఈ చిన్నది. జులై 22, 2002 హైదరాబాదులోని బంజారా హిల్స్‌లో ప్రశాంత్ కుటీర్ అనే అతిథి గృహంలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఆమె సహ నటులు సుల్తానా, అర్జున్ సరైన సమయానికి గుర్తించి నిమ్స్ ఆసుపత్రికి తరలించిన తర్వాత గజాల బ్రతికి బయటపడింది. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు మాత్రం బయటకు రాలేదు.
అయితే గజాల ఆత్మహత్యా ప్రయత్ననికి ప్రేమ వ్యవహారమే కారణం అని అప్పటిలో వార్తలు వచ్చాయి. ఇక గజాల హిందీ టీవీ నటుడైన ఫైజల్ రజా ఖాన్‌ను వివాహం చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. 2016 ఫిబ్రవరి 24 న హిందీ టీవీ నటుడు ఫైజల్ రజా ఖాన్ ను వివాహం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉంది అని సోషల్ మీడియాలో నెటిజన్స్ తెగ గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే గజాల లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.