అసలే పురాతన ఇల్లు. భారీ వర్షాలకు అది బాగా నానిపోయి పూర్తిగా దెబ్బతింది. దీంతో ఒక్కసారిగా కూలిపోయింది. అందరూ చూస్తుండగానే నిలువునా కూలి నేలమట్టమైంది. ప్రమాదం ఊహించి ఆ ఇంట్లో ఎవరూ నివాసం ఉండటం లేదు. దీంతో ప్రాణాపాయం తప్పింది. అయితే కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం భవానీపేట గ్రామంలో భారీ వర్షాలకు వడ్ల సత్తయ్య, ఈశ్వరయ్యకు చెందిన ఇల్లు కూలిపోయింది. అయితే భారీ వర్షాలకు తడిసి ముద్దయిన ఇళ్లు ప్రమాదకరంగా ఉండటంతో.. అది గమనించిన ఇంట్లోని వారు బయటకు వచ్చేశారు.
దీంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే ప్రస్తుతం ఇల్లు కూలిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే.. ఈ భారీ వర్షాలు, వరద ప్రభావితం ఎక్కువగా ఉమ్మడి ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాంతాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం స్వయంగా పరిశీలించారు. ఖమ్మం పట్టణంలో మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాలైన రాజీవ్ గృహకల్ప కాలనీ, ఎఫ్‌సీఐ రోడ్డు, బొక్కలగడ్డ కాలనీ, పెద్ద తండా తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధిత కుటుంబాలను పరామర్శించారు.
అంతేకాకుండా.. ఈ వరదల వల్ల ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు రూ.5 లక్షల సాయం చేస్తామని.. పాడి పశువులు చనిపోతే రూ.50 వేలు, గొర్రెలు, మేకలు చనిపోతే రూ.5 వేలు ఇస్తామన్నారు. పంట నష్టపోయిన రైతులను గుర్తించి ఎకరాకు రూ.10 వేలు పరిహారం అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులను ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్ర హోం మంత్రికి వివరించామని, తక్షణమే నష్ట నివారణకు సహకరించాలని కోరామని చెప్పుకొచ్చారు.
అంతేకాక తాత్కాలిక ఉపశమనంగా ప్రాథమిక అంచనా ప్రకారం కేంద్రాన్ని రూ.5,438 కోట్ల రూపాయాలు ఇవ్వాలని కోరామని తెలిపారు. అలాగే అంతేకాక రెస్క్యూ, రిపేర్, రిస్టోర్, రిపోర్టుతో జిల్లా యంత్రాంగం రాబోయే 5 రోజులూ కష్టపడి పనిచేయాలన్నారు అధికారులకు సర్కార్ ఆదేశించారు.