నిద్రపోయే ముందు పాదాలకు మసాజ్ చేయడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

మన పాదాలు ముఖ్యమైన రక్త కేశనాళికలకు నిలయం. ఆయుర్వేదం, చైనీస్ మెడిసిన్ వంటి సంపూర్ణ శాస్త్రాలు పాదాలను శ్రేయస్సు గురించి ప్రత్యేకంగా చెప్తున్నాయి. వాటిని ముఖ్యమైన అవయవంగా పరిగణిస్తున్నాయని ఆయుర్వేద వైద్యురాలు తెలిపారు. అయితే పాదాలకు మసాజ్ చేయడం వల్ల పాదాల కింది భాగానికి రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. దీనివల్ల అరికాళ్ల నొప్పి, పాదాల నొప్పి తొండరగా తగ్గుతుందని ఆయుర్వేదం చెబుతోంది.

అరికాళ్ల నొప్పితో బాధపడేవారు దీన్ని రోజూ ఫాలో అయితే ప్రయోజనాలను పొందుతారు. కొన్ని పనులు చేస్తే మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఇలాంటి వాటిలో పాదాల మసాజ్ ఒకటి. పాదాలకు మసాజ్ చేయడం వల్ల మెదడు, నాడీ వ్యవస్థ శాంతపడుతాయి. అలాగే ఒత్తిడి స్థాయిలు చాలా వరకు తగ్గుతాయి. లావెండర్ ఆయిల్ తో పాదాల మసాజ్ చేస్తే మంచి ఫలితాలను పొందుతారు. ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.

ఈ నిద్రలేమి ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే పాదాలకు మసాజ్ చేస్తే మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది. దీంతో మీకు కంటినిండా నిద్రపడుతుంది. రోజూ పాదాలకు మసాజ్ చేస్తే మీరు తొందరగా నిద్రలోకి జారుకుంటారు. పాదాలకు మసాజ్ చేయడం వల్ల మీ శరీరంలో ఉన్న దోషాలు కూడా బ్యాలెన్స్ అవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం.. పాదాలకు మసాజ్ చేయడం వల్ల వాత, పిత్త, కఫ దోషాల మధ్య సమతుల్యత ఏర్పడుతుంది.

పాదాలకు మసాజ్ చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. పాదాలకు మసాజ్ చేయడం వల్ల జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే కొన్ని పాయింట్లు సక్రియం అవుతాయి. ఇది ప్రేగు కదలికను కూడా మెరుగుపరుస్తుంది. ప్రతి రోజూ రాత్రిపూట మీరు పడుకునే ముందు పాదాలకు మసాజ్ చేయడం వల్ల మీ చర్మానికి మంచి పోషణ లభిస్తుంది. ఇది మడమల పగుళ్లను కూడా తగ్గిస్తుంది. అలాగే మడమలను పగలకుండా తేమగా ఉంచుతుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *