నిజామాబాద్ జిల్లాకు చెందిన శృతికి చిన్నతనం నుంచి సింగర్ అవ్వాలని కోరిక. ఆ కోరికతోనే కష్టపడి ఫోక్ సింగర్‌గా మారి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈ క్రమంలో ఆమెకు సిద్ధిపేట జిల్లా పీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ అనే యువకుడు సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యాడు. ఇద్దరి పరిచయం ప్రేమగా మారి పెళ్ళికి దారితీసింది. అయితే మృతురాలు శృతి ఒక ప్రముఖ గాయని ఫోక్ సాంగ్స్ పాడుతూ హైదారాబాద్‌లో ఉండేది.
ఇదే క్రమంలో దయాకర్ తో ప్రేమలో పడి తరచూ దయాకర్ స్వగృహం అయిన పీర్లపల్లి గ్రామానికి వస్తూ ఉండేది. కాగా, ఇద్దరి తల్లిదండ్రులను ఓప్పించి వివాహం చేసుకోవాలని చూశారు.. అయితే, శృతి తల్లి దండ్రులు ఈ వివాహానికి ఒప్పుకోక పోవడంతో, ఇద్దరూ కలిసి గత ఇరవై రోజుల క్రితం దయాకర్ స్వగృహంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిన 20 రోజులకు ఏమైందో ఏమో తెలియదు కానీ, బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫోక్ సింగర్ శృతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
హఠాత్తుగా శృతి ఇలా అనుమానాస్పదంగా మృతి చెందటంతో కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.. అనంతరం ఆసుపత్రికి చేరుకున్న మృతురాలి బంధువులు బోరున విలపిస్తూ, శ్రుతి ఆత్మహత్య చేసుకోలేదని, తన భర్త, అత్త వాళ్లే శ్రుతిని చంపేశారని ఆరోపిస్తున్నారు.
అత్తింటి వేధింపులే కారణమని పేర్కొంటున్నారు. అసలు శ్రుతి ఎందుకు చనిపోయింది.. అంత కష్టం ఏమోచ్చింది..? కారణాలు ఏంటి అనేది మాత్రం సస్పెన్స్ గానే మిగిలిపోయాయి.. శృతి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.