వామ్మో, విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో మంటలు, తర్వాత ఏం జరిగిందో మీరే చుడండి.

divyaamedia@gmail.com
2 Min Read

లాస్‌వేగాస్‌ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానానికి గాల్లోనే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఇది టేకాఫ్‌ అయిన కొద్ది సమయంలోనే జరగగా, పైలట్లు అప్రమత్తంగా స్పందించి విమానాన్ని తిరిగి ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. అయితే లాస్ వెగాస్ ఎయిర్ పోర్టులో టెన్షన్ వాతావరణం కనిపించింది. కారణం విమానంలో మంటలు రావడమే. అమెరికా ఎయిర్ లైన్స్ విమానం గాల్లో ఉండగా మంటలు వచ్చాయి.

అప్రమత్తమైన పైలట్… లాస్ వెగాస్ ఎయిర్ పోర్టులో సేఫ్ గా ల్యాండింగ్ చెయ్యడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. లాస్ వెగాస్‌లోని హ్యారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఒక ఘటన అందరినీ ఆందోళనకు గురిచేసింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ 1665, ఎయిర్‌బస్ A321, ఉదయం 8:11 సమయంలో నార్త్ కరోలినాలోని షార్లెట్ డగ్లస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే విమానం ఇంజన్‌లో దట్టమైన పొగ, మంటలు కనిపించాయి.

ఈ ఘటన స్థానికులు, ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. విమానం గాల్లో ఉండగా ఇంజన్ నుండి దట్టమైన పొగ, స్పార్క్స్, మంటలు బయటకు వచ్చాయని ప్రయాణికులు, స్థానిక సాక్షులు తెలిపారు. లాస్ వెగాస్ నేషనల్ గోల్ఫ్ క్లబ్‌లో ఉన్న మాథ్యూ విల్లాసిస్టా, “పెద్ద బూమ్ శబ్దాలు వినిపించాయి, ఇది బాణసంచా లాంటిది” అని ABC న్యూస్‌కు తెలిపారు.

స్థానిక నిర్మాణ కార్మికుడైన రిచర్డ్ పెడ్రోసా, ఒక పెద్ద బ్యాంగ్ శబ్దం విన్న తర్వాత విమానం ఇంజన్‌లో మంటలను చూశానని చెప్పారు. సామాజిక మీడియాలో వైరల్ అయిన వీడియోలు ఈ ఘటనను స్పష్టంగా చూపించాయి, ఇంజన్ నుండి పొగ, మంటలు రావడం కనిపించింది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *