ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోను బ్రెజిల్‌లోని సావోపాలో అంతర్జాతీయ విమానాశ్రయంలో చిత్రీకరించారు. నగరం అంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్న సమయంలో విమానాశ్రయంలోని రన్‌వేపై ఉన్న బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంపై పిడుగు పడింది. అయితే కుండపోత వర్షం పడుతున్న సమయంలో ఆకాశం ఉరుములు, మెరుపులతో అల్లకల్లోలంగా ఉంటుంది. చాలా సార్లు పిడుగులు పడతాయి. పిడుగులు సాధారణంగా ఎత్తైన బిల్డింగులు, చెట్ల మీద పడతాయి.
ఆ సమయంలో అక్కడ ఉన్న వారు పిడుగుపాటు వలన తీవ్రంగా ప్రభావితమవుతారు. తాజాగా బ్రెజిల్ లోని ఓ విమానాశ్రయంలో ఆగి ఉన్న విమానంపై నేరుగా పిడుగు పడింది. ఈ అద్భుత దృశ్యాన్ని ఎయిర్‌పోర్ట్‌లో నిల్చున్న వ్యక్తి తన కెమెరాలో రికార్డ్ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో చాలా వేగంగా వైరల్ అవుతోంది. @aviationbrk అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోను బ్రెజిల్‌లోని సావో పాలో గ్వారుల్హోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిత్రీకరించారు.
నగరం అంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్న సమయంలో విమానాశ్రయంలోని రన్‌వేపై ఉన్న బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంపై పిడుగు పడింది. ఆ ఘటన చూసిన జనాలు ఒక్కసారిగా షాక్ అవ్వడమే కాకుండా భయంతో కేకలు వేశారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. మరణించలేదు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. పిడుగు పడిన తర్వాత విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
దీంతో విమానం 6 గంటల ఆలస్యంగా బయలుదేరింది. విమానంలో పిడుగు పడినప్పుడు లోపల కూర్చున్న ప్రయాణికులకు ఎలాంటి హానీ జరగదనే సంగతి తెలిసిందే. ఎందుకంటే పిడుగు పడినా ఎలాంటి నష్టమూ వాటిల్లకుండా, పిడుగు పాటును తట్టుకునే లోహంతో విమానాన్ని తయారు చేస్తారు. ఒకవేళ విమానంపై పిడుగు పడినా అది బయటి పొరను దాటి లోపలికి వెళ్లలేదు. కాగా, ప్రస్తుత వీడియోను 3 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు.
Amazing video captures lightning striking a British Airways A350-1041 at Sao Paulo Guarulhos International Airport.
— Breaking Aviation News & Videos (@aviationbrk) January 25, 2025
Following an inspection the aircraft continued to its destination with a 6 hour delay.
📹 @bernaldinho79 pic.twitter.com/xNnTXmBCJ4