విమాన ప్రమాదంలో చెక్కు చెదరని భగవద్గీత, మంటల్లో సురక్షితంగా భగవద్గీత.. వీడియో వైరల్

divyaamedia@gmail.com
2 Min Read

మనిషిగా మనం ధర్మాన్ని పాటించాలి. ధర్మం అంటే బాధ, భయం వదిలి ఎవరి సొంత బాధ్యతలు వారు నిర్వర్తించడం. ధర్మానికి నిజమైన అర్థం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి మోసం చేయకుండా ఒప్పందం ప్రకారం ఏదైనా ఇవ్వడం, తీసుకోవడం. అయితే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. విమాన ప్రమాదాల చరిత్రలోనే అత్యంత దారుణమైన ప్రమాదంగా ఈ ప్రమాదం పరిగణించబడుతుంది . ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీతో సహా మొత్తం 246 మంది మరణించిన విషయం తెలిసిందే.

ఈ ప్రమాదంలో విమానంలోని సామాన్లతో సహా అంతా అగ్నికి దహనమై బూడిదైపోయింది. ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ఈ ప్రమాదం జరిగిన ప్రదేశంలో రెస్క్యూ ఆపరేషన్ సమయంలో.. శిథిలాల కింద ఒక భగవద్గీత కనుగొనబడింది. విమానంలో ఉన్న ప్రతి వస్తువు కాలిపోయినప్పటికీ… అగ్నికి దహనం కాకుండా ఒక్క భగవద్గీత పుస్తకం మాత్రమే అక్కడ ఉంది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. విమానం కూలిపోయిన తర్వాత భారీ మంటలు చెలరేగాయి.

విమానంలో ఉన్న మనుషులు మాత్రమే కాదు.. అందులోని వస్తువులు కూడా దగ్ధం అయ్యాయి. అయినప్పటికీ భగవద్గీత చెక్కుచెదరకుండా ఉన్నట్లు చూపించే ఒక వీడియో వైరల్ అవుతోంది. కాలిపోయిన అవశేషాల కింద భగవద్గీత సురక్షితంగా కనుగొనబడింది. అయితే దీనికి ప్రామాణికత ఇంకా తెలియదు. విమాన ప్రమాదంలో ప్రతిదీ నాశనమైంది. అయితే భగవద్గీత లోపల నుంచి చెక్కుచెదరకుండా ఉంది” అనే క్యాప్షన్‌తో ఈ వీడియో amdavad.clicks అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడింది.

వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఆపరేషన్ సమయంలో దొరికిన భగవద్గీత పుస్తకాన్ని ఒక వ్యక్తి తెరిచి ప్రదర్శిస్తున్నట్లు చూడవచ్చు. జూన్ 12న షేర్ చేయబడిన ఈ వీడియో 1.1 మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకుంది. నెటిజన్లు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. షేర్ చేస్తూ పదిమందికి ఈ విషయాన్నీ తెలియజేస్తున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *