‘ఫిష్’ వెంకట్.. కామెడీ టచ్ ఉండే రౌడీ పాత్రల ద్వారా ఆయన ఎక్కువ మార్కులు కొట్టేశాడు. ఆయన బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీని ఎక్కువ మంది అభిమానులు ఇష్టపడుతూ ఉంటారు. అలా 100కి పైగా సినిమాలలో నటించిన ‘ఫిష్’ వెంకట్, ఈ మధ్య కాలంలో తెరపై ఎక్కువగా కనిపించడం లేదు. అయితే కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న ఫిష్ వెంకట్ కొన్ని నెలల క్రితమే డయాలసిస్ చికిత్స తీసుకున్నాడు. దీని తర్వాత బాగానే ఉన్న నటుడు ఇప్పుడు మరోసారి ఆస్పత్రిలో చేరారు.
ప్రస్తుతం ఎవరినీ గుర్తు పట్టేలేనంతగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఫిష్ వెంకట్ ఫ్యామిలీ.. తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఎవరైనా దాతలు తమకు అండగా నిలవాలని ఆయన భార్య, కూతురు వేడుకుంటున్నారు. గతంలో చికిత్సకు డబ్బుల్లేక గాంధీ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్న సంగతి తెలిసిందే.
అయితే వెంకట్ పరిస్థితిని తెలుసుకున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆయనకు రూ. 2 లక్షల ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. అయితే ఇప్పుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో అతని కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఫిష్ వెంకట్‌కు డయాలసిస్ చేస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అతడున్న పరిస్థితుల్లో డయాలసిస్‌తో పాటు ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా అవసరమని వైద్యులు అంటున్నారు. కాగా కమెడియన్‌గా, విలన్‌గా నటించి తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యారు ఫిష్ వెంకట్.
ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది చిత్రంలో ఆయన చెప్పిన తొడ గొట్టు చిన్న డైలాగ్ ను ఎవ్వరూ అంత త్వరగా మరిచిపోలేరు. అలాగే పవన్ కల్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలోనూ తన కామెడీతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. దాదాపు వందకు పైగా చిత్రాల్లో, అందరూ స్టార్ హీరోలతో కలిసి నటించారు వెంకట్. అలాంటిది ఇప్పుడాయన దీన పరిస్థితిలో ఉండడాన్ని చూసి సినీ ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగు హీరోలు వెంకట్ కు సాయం చేయాలని , అలాగే మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ) కూడా ఫిష్ వెంకట్ ను అండగా నిలవాలని కోరుతున్నారు.
@iVishnuManchu hi sir I saw today fish venkat sir in gandhi hospital his health not good he is taking dailosis weekly three times pls help from ma association 🙏🙏🙏🙏🙏 pic.twitter.com/MuNMzOabCS
— gade prashanth reddy (@gadeprashanth) June 25, 2025