రక్తం తీసినా.. జుట్టు కత్తిరించినా..! వినేశ్‌ ఫోగట్‌ ‘ఫైనల్‌’ ఫైట్‌ కి ముందు ఏం జరిగిందో తెలిస్తే..?

divyaamedia@gmail.com
2 Min Read

100 గ్రాముల అధిక బరువు ఉన్నందుకు వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు వేశారు. అయితే దీని వెనక కుట్ర జరిగిందంటూ భారీగా ఆరోపణలు వస్తున్నాయి. వినేష్ ఫోగట్ ఫైనల్ గెలిస్తే స్వర్ణం వచ్చేది. లేకుంటే రజిత పతకం వచ్చేది. కానీ ఆమెను అనూహ్యంగా తప్పించడంతో భారతీయులు ఆవేదన చెందుతున్నారు. అయితే మంగళవారం జరిగిన సెమీ ఫైనల్స్‌లో వినేశ్‌ ఫోగట్‌ 5-0 తేడాతో వరల్డ్‌ ఛాంపియన్‌ రెజ్లర్‌ క్యూబాకు చెందిన యుస్నీలీస్‌ గుజ్మాన్‌ను మట్టికరిపించింది. ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో భారతీయులంతా రెజ్లింగ్‌లో మనకు పతకం ఖాయమనుకున్నారు. కానీ ఫైనల్‌ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు ఐవోసీ వినేశ్‌పై అనర్హత వేటు వేసింది.

దీనిపై భారత అధికారులు నిరసన తెలిపారు. వేయిట్‌ తగ్గేందుకు..ఇక ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు ఫోగట్‌ బరువుపై అధికారులు అభ్యంతరం తెలిపారు. దీంతో మంగళవారం రాత్రంతా ఆమె తీవ్ర కసరత్తు చేసింది. బరువు తగ్గడానికి జుత్తు కత్తింరించుకుంది. రక్తం కూడా తీయించుకుంది. ఇక నీళ్లు తాగకుండా, ఆహారం తీసుకోకుండా జాగింగ్, స్కిప్పింగ్, సైక్లింగ్‌ చేసింది. అయినా ఫలితం దక్కలేదు. దురదృష్టం ఆమె వెన్నంటే ఉంది. దీంతో ఫైనల్‌కు ముందు 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండడంతో పోటీకి అనర్హురాలుగా ప్రకటించారు. 100 కోట్ల మంది భారతీయుల ఆశలపై ఐవోసీ అధికారులు నీళ్లు చల్లారు.

గోల్డ్‌ మెడల్‌ ఎవరికంటే..?ఇక ఈ పోటీల్లో వినేశ్‌పై అనర్హత వేటు పడినందున ఆమెకు ఎలాంటి పతకం ఇవ్వరు. అయితే ఆమోతోపాటు ఫైనల్‌లో ఉన్న అమెరికా క్రీడాకారిణి సారా హిల్డెబ్రాండ్‌కు మాత్రం ఆఖరిపోరులో పాల్గొనకుండానే బంగారు పతకం అందిస్తారు. సిల్వర్‌ మెండల్‌ మాత్రం ఎవరికీ కేటాయించరు. ఇక కాంస్య పతక పోటీలు లాంఛనంగా జరుగతాయని ఐవోసీ ప్రకటించింది. ఐవోఏ ఛాలెంజ్‌..ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ తీసుకున్న నిర్ణయంపై భారత ఒలింపిక్‌ సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిని ఛాలెంజ్‌ చేసేందుకు సిద్ధమైంది. పోటీ జరిగిన రోజు 50 కేజీలు ఉండి, పైనల్‌కు ముందు రాత్రి బరువు పెరిగినట్లు పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఐవోసీ పునఃసమీక్ష చేయకుంటే.. ఫోగట్‌పై అనర్హత కొనసాగుతుంది.

మోదీ భరోసా..ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో రెజ్లర్‌ వీనేశ్‌ ఫోగట్‌పై అనర్హత వేటు పడడంపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఈమేరకు ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. ”వీనేశ్‌ నువ్వు ఛాంపియన్లకే చాంపియణ.. నీ ప్రతిభ దేశానికే గర్వకారణం. భారతీయులందరికీ నువ్వు ఓ ఇన్‌స్పిరేషన్‌. ఈ రోజు నీకు తగిలిన ఎదురుదెబ్బ నన్ను ఎంతగానో బాధించింది. దీనిపై విచారం వ్యక్తం చేయడానికి నా దగ్గర మాటలు లేవు కానీ, ఈ బాధ నుంచి బయటపడి నువ్వు మరింత బలంగా తిరిగి రావాలని నేను నమ్ముతున్నాను. కఠినమైన సవాళ్లను ఎదురించడం నీ నైజం. మేమంతా నీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం” అని వినేశ్‌కు భరోసా ఇచ్చారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *