కంటి చూపు పోయిందని బిగ్ బాస్ బ్యూటీ ఆవేదన, కంటిచూపు సమస్యతో..?

divyaamedia@gmail.com
2 Min Read

బాలీవుడ్‌ బిగ్ బాస్ బ్యూటీకి ఈ చేదు అనుభవం ఎదురయ్యింది. బిగ్‌బాస్‌, టెలివిజన్ సిరీస్ దిల్ సే దిల్ తక్ ద్వారా ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్న జాస్మిన్‌ బాసిన్‌ అనే నటి తాత్కలికంగా కంటి చూపు కోల్పోయింది. కాంటాక్ట్ లెన్స్‌లు ధరించడం వల్ల తన కార్నియా పాడైందని.. చివరకు కంటి చూపు కోల్పావాల్సిన పరిస్థితి వచ్చిందంటూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం సంచలనంగా మారింది. విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు నటి ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక తనకు ఈ సమస్య ఎందుకు వచ్చింది.. అసలేం జరిగింది అనే దాని గురించి జాస్మిన్‌ తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చసింది. ఆమె వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఐదు రోజుల క్రితం అనగా.. జూలై 17న జరిగిన ఒక ఈవెంట్ కోసం లెన్స్‌లు ధరించడంతో తనకు ఈ సమస్య మొదలైందని చెప్పుకొచ్చింది జాస్మిన్‌. నొప్పి తీవ్రం కావడంతో ఏమీ చూడలేకపోయాన్నది. జాస్మిన్‌ చేసిన పోస్టులో ఇలా రాసుకొచ్చింది..‘‘గత వారం అనగా జూలై 17న ఢిల్లీలో జరిగే ఓ ఈవెంట్‌కు సిద్ధమవుతున్నప్పుడు కళ్లకు లెన్స్‌లు ధరించాను. వాటిని పెట్టుకున్న తర్వాత నుంచి తన కళ్ళ నొప్పులు మొదలయ్యాయి.

ఎంతకు తగ్గలేదు సరికదా.. సమయం గడిచిన కొద్ది నొప్పి తీవ్రం కావడంతో వెంటనే డాక్టర్‌ దగ్గరకు వెళ్లాలని భావించాను. కానీ అప్పటికే ప్రోగ్రామ్‌ను ఒప్పుకోవడంతో మాట తప్పలేక ఆ ఈవెంట్‌లో పాల్గొనాల్సి వచ్చింది. ఢిల్లీలో జరిగిన ఈవెంట్‌కు సన్ గ్లాసెస్ ధరించాను. కానీ దాని తర్వాత క్రమంగా నా కంటి చూపు తగ్గిపోయింది’’ అని చెప్పుకొచ్చింది. ‘‘ఈవెంట్‌ అయిపోగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. వెంటనే వెళ్లి కంటి డాక్టర్‌ను సంప్రదించాను. అక్కడ నాకు టెస్టులు చేసి కంటిలోని కార్నియా దెబ్బతిన్నదని వైద్యులు తెలిపారు. ఆ తర్వాత కళ్లకు చికిత్స చేసి కట్టు కట్టారు.

తర్వాత రోజు నేను ముంబై తిరిగి వచ్చాను. ప్రస్తుతం ఇక్కడ చికిత్స తీసుకుంటున్నాను. మరో నాలుగు, ఐదు రోజులు రెస్ట్‌ తీసుకోవాలని.. వైద్యులు సూచించారు. అప్పటి వరకు కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి. నాలుగు రోజుల పాటు నేను ఏం చూడలేను. నాకు ఏం కనిపించదు.. నిద్ర పోవడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది’’ అంటూ కళ్లకు కాటన్‌ పట్టి ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న జాస్మిన్‌ అభిమానులు ఆమె తర్వగా కోలుకోవాలని కోరుతూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *