తాజాగా ప్రముఖ హీరోయిన్ ఈషా రెబ్బా గురించి కూడా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్ అవడంతో ఈ విషయాలపై ఆమె స్పందిస్తూ రూమర్స్ కి చెక్ పెట్టింది. తెలుగమ్మాయిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈమె గత కొద్ది రోజులుగా ప్రముఖ డైరెక్టర్, నటుడు అయిన తరుణ్ భాస్కర్ తో ప్రేమలో పడిందని, వివాహం కూడా చేసుకోబోతోంది అంటూ రూమర్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఈషా రెబ్బా, తరుణ్ భాస్కర్ లు త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని రూమర్లు వినిపిస్తున్నాయి.
‘ఓం శాంతి శాంతి శాంతి’ సినిమా షూటింగులో వీరు ప్రేమలో పడ్డారని, త్వరలోనే పెళ్లి కబురు వినిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్లకు తగ్గట్టుగానే ఈషా, తరుణ్ భాస్కర్ లు తరచూ జంటగానే కనిపిస్తున్నారు. ఆ మధ్యన తిరుమలకు కూడా కలిసే వెళ్లొచ్చారు. దీంతో ఇషా, తరుణ్ నిజంగానే పెళ్లి చేసుకుంటున్నారేమోనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఈ విషయంపై ఈషా రెబ్బా స్పందించింది.
ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఓ ఆసక్తికరమైన వీడియోను షేర్ చేసింది. ‘ఎవరైనా మిమ్మల్ని ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు?’ అని అడిగేవారికి.. ఈషా ఒక వైరల్ మీమ్ వీడియోతో రిప్లై ఇచ్చింది. ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి ఇంగ్లిష్ స్పీచ్‌ను బ్యాక్‌గ్రౌండ్‌లో జోడించింది. అందులో ‘ ఏ ఏ పనులు, ఏ ఏ సమయాల్లో జరగాలో.. ఆయా పనులు ఆయా సమయాల్లో కచ్చితంగా జరిగి తీరుతాయి’ అనే డైలాగ్‌తో తన పెళ్లి గురించి మాట్లాడే వారికి రిప్లై ఇచ్చింది.
తన పెళ్లి గురించి అంతా కాలమే నిర్ణయిస్తుందంటూ ఈషా షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
