ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ను రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రశ్నించారు. సుమారు మూడు గంటల అధికారులు ఆయనను విచారించి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. అయితే 2018-19లో రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్‌లో పలువురు ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే.
అల్లు అరవింద్ పేరు కూడా ఇందులో ఉంది. దీంతో ఈ స్కామ్‌లో ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల కొనుగోళ్లు, సన్నిహితులతో సంబంధాలపై ఆరా దీస్తూ ఈడీ అధికారులు అల్లు అరవింద్‌ను ప్రశ్నించినట్టు సమాచారం.
ఈ విచారణలో భాగంగా.. బ్యాంక్ స్కామ్‌లో తనకు ఎలాంటి ప్రమేయం లేదని అల్లు అరవింద్ అధికారులు ముందు స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. అయితే ఈ విచారణను కొనసాగించాల్సిన అవసరం ఉందని భావించిన ఈడీ అధికారులు, తదుపరి వారంలో మరోసారి హాజరుకావాల్సిందిగా అల్లు అరవింద్‌కు నోటీసులు జారీ చేశారు.
రాబోయే రోజుల్లో విచారణలో అల్లు అరవింద్ ఇచ్చే సమాధానాలు, ఈ కేసులో మరింత స్పష్టత తీసుకురానున్నాయి. గీత ఆర్ట్స్ బ్యానర్‌ను స్థాపించిన అల్లు అరవింద్, ఎన్నో విజయవంతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించిన విషయం తెలిసిందే. అలాగే అల్లు అరవింద్ కుటుంబం నుంచి హీరోగా టాలీవుడ్‌లోకి వచ్చిన అల్లు అర్జున్, ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా సత్తా చాటుతున్నారు.
‘పుష్ప’ సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించిన ఆయన.. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో మరో భారీ సినిమా చేస్తున్నారు. మరోవైపు నిర్మాతగా అల్లు అరవింద్ కూడా గీత ఆర్ట్స్-2 బ్యానర్ ద్వారా వరుస సినిమాలు నిర్మిస్తున్నారు.