నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో యాంకర్లు, టీవీ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల నుంచి సినీ ప్రముఖుల వరకూ అందరిపై ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ కేసులో పలువురిని హైదరాబాద్ పోలీసులు విచారించారు. దీనిపై సిట్‌ను కూడా ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే బెట్టింటి యాప్స్ ప్రమోషన్స్ కేసులో విజయ్ దేవర కొండ,
రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మీ, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, శ్రీముఖి, ప్రణిత, విష్ణు ప్రియలతో పాటు మరికొంతమంది పై కేసు నమోదు చేశారు. ఈ యాప్స్ ను ప్రమోట్ చేయడానికి వీరు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే సెలబ్రెటీలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కోసం తీసుకున్న డబ్బు ఐటీ రిటర్న్స్ లో లేవని అధికారులు గురించారు.
ఆ డబ్బుకు సంబంధించి సరైన లెక్కలు లేనందున వారిపై మనీ లాండరింగ్ కింద కేసు ఈడీ కేసు నమోదు చేసింది. ఇక బెట్టింగ్ యాప్స్ విషయంలో గతంలో పలువురు సెలబ్రెటీలు విచారించారు అధికారులు. కొంతమందికి నోటీసులు పంపారు. ఆ సమయంలో విజయ్ దేవరకొండ, రానా టీమ్ లో స్పందించాయి. నిషేదిత బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయలేదని, స్కిల్ డవలప్ గేమ్స్ మాత్రమే ప్రమోట్ చేశారు అని విజయ్ దేవరకొండ టీమ్ తెలిపింది.
చట్టపరమైన అనుమతులు ఉన్న యాప్స్ ను మాత్రమే ప్రమోట్ చేశామని విజయ్, రానా టీమ్స్ తెలిపాయి. అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తో తాము కుదుర్చుకున్న ఒప్పందం కూడా ముగిసిపోయిందని తెలిపారు. అలాగే ప్రకాష్ రాజ్ కూడా 2016లోనే తాను బెట్టింగ్ యాప్ తో కుదుర్చుకున్న డీల్ అయిపోయిందని తెలిపారు. కాగా ఇప్పుడు మరోసారి ఈడీ అధికారులు ఈ కేసు పై దూకుడు పెంచారు. మరి కేసు నమోదు కావడంపై సినీ సెలబ్రెటీలు ఎలా స్పందిస్తారో చూడాలి.