గుండెపోటు ప్రాణాపాయకరమైన గుండెకు సంబంధించిన వ్యాధి. ఆధునిక కాలంలో గుండె జబ్బుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి. అయితే మార్కెట్లో మనకు అనేక రకాల సీజనల్ ఫ్రూట్స్ అందుబాటులో ఉన్నాయి. పండ్లలో మంచి మొత్తంలో పోషకాలు, నీరు సమృద్ధిగా ఉంటుంది. ఈ పండ్లలో పైనాపిల్ ఒకటి. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, అనేక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. ఇందులో క్యాల్షియం, ఫైబర్, విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇది అనేక సమస్యల నుండి బయటపడటానికి సహాయపడుతుంది.
జీర్ణ సమస్యలతో బాధపడేవారికి పైనాపిల్ జ్యూస్ చాలా మేలు చేస్తుంది. విరేచనాలు, కడుపు నొప్పి, మలబద్ధకం లేదా ఉబ్బరంతో బాధపడుతుంటే, పైనాపిల్ రసం అనువైనది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. పైనాపిల్స్‌లో కాల్షియం, మెగ్నీషియం, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలు, దంతాలను బలపరుస్తుంది. పైనాపిల్ యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి మంచి మూలం. ఇది గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి.
రక్తపోటు రోగులకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. పైనాపిల్ రసంలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పిల్లలకు పైనాపిల్ జ్యూస్ ఇవ్వడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. రోజూ పైనాపిల్ తింటే క్యాన్సర్, గుండె జబ్బులు మీ దరికి చేరవని నిపుణులు చెబుతున్నారు. ఫైనాపిల్ లో పొటాషియం, సోడియం మూలకాలు ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులకు రాకుండా చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో పైనాపిల్ ఉపయోగపడుతుంది. పచ్చి పైనాపిల్ రసాన్ని తెగిన గాయా లపై వేస్తే రక్తస్రావం అరికడుతుంది.
పైనాపిల్ రసాన్ని పచ్చకామెర్ల వ్యాధి, కాలేయ వ్యాధులున్నవారు ప్రతిరోజు ఈ రసాన్ని తాగితే మంచి ఫలితాలన్ని ఇస్తుంది. పైనాపిల్ జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడంలో సహాయపడుతుంది. పైనాపిల్ జుట్టు రాలడం తగ్గించడంలో సహాయపడుతుంది. రక్త నాళాల్లో రక్తం గడ్డకట్ట కుండా కాపాడుతుంది. ఆడవారికైతే నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది. పండిన పైనాపిల్ పండును తింటుంటే పళ్ళ నుండి రక్తం కారే స్కర్వే వ్యాధి రాకుండా రక్షణ కలిగిస్తుంది. పూర్తిగా పండని పైనాపిల్ రసం తీసుకుంటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.
జ్వరం, కామెర్ల వంటి అనారోగ్యాలలో ఉన్న వారికి పైనాపిల్ రసం ఇవ్వడం ఎంతో మంచిది. పైనాపిల్ పండు రసాన్ని ముఖానికి రాసుకుని మర్థన చేస్తే ముఖ చర్మం కోమలంగా, అందంగా మారుతుంది. పండులోని ఎంజైములు ముఖ చర్మంలో నశించిన కణాలను తొలగిస్తాయి. అంతే కాకుండా నల్లటి మచ్చలను తొలగిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాలను త్వరగా వృద్ధాప్యంలోకి రాకుండా చూస్తాయి.