దుర్గమ్మకు.. 2.5 కోట్ల విలువైన వజ్ర కిరీటాన్ని బహుమతిగా ఇచ్చిన అజ్ఞాతవాసి.

divyaamedia@gmail.com
1 Min Read

శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని తొమ్మిది రోజుల పాటు నవ దుర్గలుగా వివిధ అవతారాల్లో తన భక్తులతో పూజలను అందుకోనున్నది. అమ్మవారి ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. దసరా నవరాత్రుల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండపై కొలువైన కనక దుర్గమ్మ ఆలయం వైభవంగా ముస్తాబైంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

అయితే విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన ఉన్న కనకదుర్గమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుతుంటారు. ఈ ఉత్సవాల్లో అమ్మవారిని ప్రత్యేక ఆభరణాలతో అలంకరిస్తుంటారు. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు. దేశం నలుమూలల నుంచి భక్తులు ఇందకీలాద్రికి చేరుకుని మొక్కులు చెల్లించుకుంటారు.

కోరిన కోర్కెలు తీర్చే మహిమగల తల్లీ అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శరన్నవరాత్రుల్లో దుర్గమ్మను దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. ఈ సందర్భంగా అమ్మవారికి కానుకలు చెల్లించుకుంటారు. ఎవరికి తోచినంత వారు డబ్బు, నగల రూపంలో కానుకలు సమర్పిస్తుంటారు. ఈ క్రమంలో ఓ అజ్ఞాత భక్తుడు కనకదుర్గమ్మకు భారీ కానుక అందజేశాడు.

దుర్గాదేవీపై తనకున్న భక్తిని చాటుకున్నాడు. ఏకంగా 2.5 కోట్లు విలువ చేసే బంగారు కిరీటాన్ని బహూకరించాడు. ఆ కిరీటం అంతా బంగారం, వజ్రాలతో దగదగ మెరిసిపోతున్నది. శరన్నవరాత్రుల్లో మొదటి రోజు కనకదుర్గమ్మ అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తుంది. దుర్గమ్మ వజ్ర కిరీటంతో భక్తులకు దర్శనమివ్వనున్నది. మరి అజ్ఞాత భక్తుడు బెజవాడ దుర్గమ్మకు బహూకరించిన భారీ కానకపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *