బ్రతికున్నవాళ్లే చనిపోయినట్టు కల వస్తే ఏం జరుగుతుందో తెలుసా..? ఈ నిజాలు మీకు తెలుసా..?

divyaamedia@gmail.com
1 Min Read

నిద్రలో కొన్ని కలలు ప్రశాంతతను తీసుకువస్తే. కలలో ఆనందంగా నవ్వుతూ కనిపించడం, వివాహానికి హాజరవ్వడం, సంగీతం వినడం, పాడడం వంటివి కనిపిస్తే.. త్వరలో ఏదో ప్రమాదం జరగబోతోందనడానికి సూచన. కలలో ఎవరో తిరుగుతున్నట్టు అనిపిస్తే అది త్వరలో కలిగే సంపద నష్టాన్ని సూచిస్తుంది. అయితే సాధారణంగా కలలను రెండు రకాలుగా చెబుతారు.

ఒకటి, మనం భవిష్యత్తు గురించి కళ్లు తెరిచి కనే కలలు, రెండు, రాత్రి నిద్రలో వచ్చే కలలు. ఈ నమ్మకాలకు భిన్నంగా హిందూ కలల శాస్త్రం.. కలలను ఒక ప్రత్యేక కోణంలో చూస్తుంది. కలల శాస్త్రం ప్రకారం.. మనం చూసే కలలు మన జీవితాలపై వివిధ ప్రభావాలను చూపుతాయి. అంతేకాకుండా భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను కూడా సూచిస్తాయి.

స్వప్న శాస్త్రం ప్రకారం.. ఒక వ్యక్తి కలలో తాను చనిపోయినట్లు పదే పదే చూస్తే, అది భయపడాల్సిన విషయం కాదు. దీనికి భిన్నంగా ఈ కల మంచి ఫలితాన్ని సూచిస్తుంది. మీ కలలలో మీరు చనిపోయినట్లు చూస్తే, రాబోయే సంక్షోభం లేదా మరణ ముప్పు అప్పటికే దాటిపోయిందని లేదా తప్పిపోయిందని అర్థం. కాబట్టి మీ సొంత మరణం గురించి కలలు కన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు.

ఒకవేళ మీరు మీ కలలో ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నట్లు చూసినట్లయితే.. స్వప్న శాస్త్రం దీనిని భవిష్యత్తు గురించి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది. భవిష్యత్తులో మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉందని దాన్ని అర్థం. ఈ కల మిమ్మల్ని జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండమని సూచిస్తుంది. ఈ కలలను కేవలం ఒక సూచనగా మాత్రమే పరిగణించాలని, అప్రమత్తతతో ఉండటం ద్వారా రాబోయే ఇబ్బందులను ఎదుర్కోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *