ప్రముఖ బాలీవుడ్ నటుడు అరుణోదయ్ సింగ్ ప్రేక్షకులకు సుపరిచితుడే. 2009లో ‘సికిందర్’ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత యే సాలి జిందగీ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలానే జిస్మ్ 2, మై తేరా హీరో, మిస్టర్.ఎక్స్, మోహెంజో దారో, బ్లాక్‌మెయిల్ వంటి సినిమాల్లో నటించారు. ఇక అఫ్రాన్ వెబ్ సిరీస్‌లో అతని నటనకు ప్రశంసలు దక్కాయి. కెరీర్ పరంగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ నటుడు పర్సనల్ లైఫ్ మ్యాటర్ తో మాత్రం హాట్ టాపిక్ గా మారాడు.
అయితే గోవాలో లీ ఎల్టన్‌కు ఓ కేఫ్ ఉంది. అక్కడే వీరిద్దరి చూపులు కలిశాయి. ప్రేమ చిగురించింది. పెద్దల అంగీకారంతో 2016 డిసెంబర్ 13న గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. కానీ, వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు. అరుణోదయ్‌కి కుక్కలంటే చాలా ఇష్టం. ఇంట్లో చాలా పెంపుడు కుక్కలు ఉండేవి. కానీ వాటి అరుపులు, గోల లీ ఎల్టన్‌కు చిరాకు తెప్పించాయి. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. చివరకు ఆ గొడవలు పీక్స్‌కి చేరాయి. దీంతో విడాకులు తీసుకోవడమే మంచిదని ఇద్దరూ నిర్ణయించుకున్నారు.

2019లో అరుణోదయ్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. చూడటానికి ఎంతో అన్యోన్యంగా కనిపించిన ఈ జంట.. పెళ్లైన మూడేళ్లకే విడిపోయారు. ప్రస్తుతం అరుణోదయ్ వయసు 42 ఏళ్లు. ఇంకా సింగిల్‌గానే ఉన్నాడు. రాజకీయ కుటుంబంలో పుట్టినా అరుణోదయ్ మాత్రం యాక్టింగ్‌పై ఇంట్రస్ట్ పెంచుకున్నాడు. కొడైకెనాల్‌లోని బోర్డింగ్ స్కూల్‌లో చదువుతున్నప్పుడే నాటకాలు వేశాడు. మార్లన్ బ్రాండో ‘ఆన్ ది వాటర్‌ఫ్రంట్’ (1954) సినిమా చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు. బ్రాండీస్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ, యాక్టింగ్ స్టూడియోలో యాక్టింగ్ కోర్సు చేశాడు.
ఆ సమయంలో థియేటర్ ప్రొడక్షన్స్‌లోనూ నటించాడు. ప్రేమ ఎంత గొప్పదైనా.. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాల్లో వచ్చే విభేదాలను తట్టుకోలేదని అరుణోదయ్ విడాకుల విషయం నిరూపిస్తోంది. డివోర్స్ తీసుకుని ఆరేళ్లు గడుస్తున్నా.. అరుణోదయ్ ఇంకా సినిమాలపైనే దృష్టి పెడుతున్నాడు. కుక్కలంటే మాత్రం ఇప్పటికీ అతనికి అంతే ప్రేమ.