తరాలు మారేకొద్దీ మనిషి బుద్ధి మారుతుందని నేటి మానువుడు నిరూపిస్తే.. ఎన్ని జన్మలెత్తినా మరెన్ని తరాలు గడచినా కుక్కకున్న విశ్వాసం మరే జీవిలో ఉండదని ఓ శునకం నిరూపించింది. అయితే కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన చూసిన ప్రతి ఒక్కరిని కంటనీరు పెటపెట్టించింది.
జమ్మికుంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి నెలరోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. తనను అల్లారుముద్దుగా పెంచుకున్న కుక్క (క్యాచ్ ఫార్ ల్యాబ్) యజమాని కనిపించకపోవడంతో తిండి తిప్పలు మానేసి ప్రతి రోజు యజమాని ఫోటో ముందు కూర్చుని దీనంగా ఉంటుంది.
సమ్మిరెడ్డికి కుక్కలు అంటే ఎనలేని ప్రేమ ఎప్పుడూ ఎటు ప్రయాణం చేసిన వాకింగ్ చేసిన ఇంట్లో ఉన్న తన వెంట కుక్క ఉండేది యజమాని నెల రోజులైనా కనిపించకపోవడంతో తిండి తినలేక అటు యజమాని కనిపించకపోవడంతో బాధతో కృంగిపోయి సరిగా సమ్మిరెడ్డి నెలరోజుల దినం రోజు ఇటు ముందు అందరూ కనిపిస్తున్న తన యజమాని కనిపించకపోవడంతో బాధతో ఆ కుక్క నేలపైనే మృత్యువాత పడింది.
అది గమనించిన కుటుంబ సభ్యులు సమ్మిరెడ్డి ఆత్మకు శాంతి చేకూరేలా లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించి గ్రామ శివారులోని ప్రాంతంలో పూడ్చిపెట్టారు కుక్క చనిపోవడాన్నీ చూసిన కుటుంబ సభ్యులతో పాటు బంధువులు కన్నీరు పెట్టుకున్నారు.