Dog Dubbing: ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో కొత్త రికార్డు, కుక్క‌తో డ‌బ్బింగ్ చెప్పించిన ద‌ర్శ‌కుడు.

divyaamedia@gmail.com
2 Min Read

Dog Dubbing: ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో కొత్త రికార్డు, కుక్క‌తో డ‌బ్బింగ్ చెప్పించిన ద‌ర్శ‌కుడు.

Dog Dubbing:కామెడీ అండ్ ఎమోష‌నల్ జాన‌ర్‌లో వ‌చ్చిన ఈ చిత్రం మంచి విజ‌యాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాకు 4 సంవ‌త్స‌రాల త‌ర్వాత సీక్వెల్ అనౌన్స్ చేశారు మేక‌ర్స్. నాను మత్తు గుండా 2 అంటూ ఈ సినిమా రానుండ‌గా.. షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది ఈ చిత్రం. అయితే 2020లో థియేటర్లలో రిలీజైన నాను మత్తు గుండా మూవీకి స్వీకెల్‌గా రాబోతుంది నాను మత్తు గుండా. చార్లీ మూవీ లెవల్లోనే ఇది కూడా ఆటోడ్రైవర్, గుండా అనే అనాథ కుక్కని పెంచుకోవడం అనే కాన్సెప్టుతో తెరకెక్కింది. ఈ సినిమా హిట్ కొట్టడంతో దీనికి సీక్వెల్ తీస్తున్నారు. ఇందులో కుక్క చుట్టూ కథ అల్లుకోనుంది.

Also Read: భార్య,కూతురు చేసిన పనికి అమితాబచ్చన్ ఫ్యామిలీ పరువు పాయే..!

శంకర్ మరణం తర్వాత గుండా ప్రయాణం ఎలా సాగుతుందో చూపించనున్నాడు దర్శకుడు రఘు హాసన్. ఇప్పటికే మైసూర్, చుట్టు పక్కల ఉన్నఅందమైన ప్రదేశాల్లో షూటింగ్ జరిగింది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇందులో భాగంగానే కనివినీ ఎరుగని రీతిలో ఓ కుక్క తన పాత్రకు డబ్బింగ్ చెప్పిందట. లాబ్రాడర్ జాతికి చెందిన సింబా అనే శునకంతో డబ్బింగ్ చెప్పించారు. రియాలిటీకి దగ్గరగా ఉండటం కోసం ఈ ప్లాన్ చేశారు మేకర్స్. ఈ డబ్బింగ్ పనులు పూర్తయ్యాక.. టీమ్ డిజిటల్ ఇంటర్మీడియట్, రీ రికార్డింగ్ పనులను ప్రారంభిస్తారు. ఇక ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ అందించడం విశేషం.

Also Read: నాగచైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లి జాతకం చెప్పి చిక్కుల్లో పడిన వేణు స్వామి.

నాను మట్టు గుండా 2 పోయెమ్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ రుత్విక్ మురళీధర్ అందిస్తున్నాడు. త్వరలో ఈ మూవీ విడుదల కానుంది. కాగా, కుక్కతో డబ్బింగ్ చెప్పించడంతో మరోసారి కన్నడ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కేజీఎఫ్, చార్లీ వంటి చిత్రాలతో పాన్ ఇండియన్ గుర్తింపు తెచ్చుకున్న చందన సీమ.. సరికొత్త ప్రయోగాలకు నాంది పలుకుతుంది. ఇది సక్సెస్ అయితే.. భవిష్యత్తులో మరిన్ని జంతువులు కూడా తమ డబ్బింగ్ అవే చెప్పుకుంటాయేమో..!

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *