మన ప్రధాన నగరాలతో పాటు, ముఖ్యమైన పట్టణాల్లో సైతం డీమార్ట్ బ్రాంచీలు వెలిసాయి. ఇంటి దగ్గర కిరాణా షాపుల్లో కొనే బదులు.. ఇక్కడ కొంటే కాస్త డిస్కౌంట్ అయినా వస్తుందని చాలా మంది వెళ్తుంటారు. అంతేకాకుండా.. మనకు కావాల్సిన అన్ని వస్తువులు ఒకే చోట దొరుకుతుండడంతో ప్రజలు డీమార్ట్‌కు వెళ్లి.. షాపింగ్ చేయడానికి ఇష్టపడతారు. అయితే కస్టమర్లను ఆకర్షించడానికి DMART పండుగలు లేదా ప్రత్యేక రోజులలో డిస్కౌంట్లను అందిస్తుంది.
కొన్నిసార్లు వారాంతాల్లో కూడా ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. డిమార్ట్ షాపింగ్‌లో కిరాణా సామాగ్రి, ఎలక్ట్రానిక్స్, బట్టలు, బ్రాండెడ్ ఉత్పత్తులను తక్కువ ధరలకు విక్రయిస్తుంది. కొన్నిసార్లు మీరు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రసిద్ధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల కంటే తక్కువ ధరలకు డిమార్ట్‌లో కొన్ని వస్తువులను కొనుగోలు చేయవచ్చు. అలాంటప్పుడు మీరు ఉత్పత్తులు చౌకగా ఉన్నాయని వాటిని కొనకూడదు. వాటి నాణ్యతపై కూడా శ్రద్ధ వహించాలి.

ఎందుకంటే..DMart లో ఈ ఆఫర్లు ఉన్న ఉత్పత్తులు ఎక్కువగా పాత స్టాక్ లో కనిపిస్తుంటాయి. అందుకే ఆహార పదార్థాలు, సౌందర్య సాధనాలను కొనుగోలు చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే రిటర్న్ పాలసీ. కొన్ని వస్తువులు, ముఖ్యంగా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినవి తిరిగి ఇవ్వబడవు. లోదుస్తులు, సౌందర్య సాధనాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను తిరిగి ఇవ్వలేము. అదేవిధంగా, DMart లోని కొన్ని వస్తువులను కూడా తిరిగి ఇవ్వలేము.
అలాంటప్పుడు మీరు కొంటున్న ఉత్పత్తులను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని తీసుకోవటం ఉత్తమం. షాపింగ్ చిట్కాలు.. కొన్ని వస్తువులు ‘స్టాక్ ఉన్నంత వరకు’ మాత్రమే అమ్ముడవుతాయి. కాబట్టి, మీరు వాటిని కొనుగోలు చేస్తే మీకు అవసరమైన నాణ్యత, ధర, రిటర్న్ పాలసీని పూర్తిగా చెక్ చేయకుండా వాటిని కొనుగోలు చేయకూడదు. డి-మార్ట్ సాధారణంగా గడువు తేదీకి దగ్గరగా ఉన్న వస్తువులపై అధిక డిస్కౌంట్లను అందిస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా, మీరు పెద్ద మొత్తంలో ఆదా చేయవచ్చు.