డీమార్ట్‌ ఆఫర్ల వెనుక ఎవ్వరికీ తెలియని సీక్రెట్స్, డీమార్ట్‌ అసలు బండారం తెలిస్తే..?

divyaamedia@gmail.com
2 Min Read

ఎంఆర్‌పి (MRP) ధర కంటే తక్కువకే వస్తువులు విక్రయించడం డీమార్ట్ ప్రత్యేకత. అయితే, అందరూ ఎక్కువ ధరకు అమ్ముతుంటే డీమార్ట్ మాత్రం ఇంత తక్కువకు ఎలా ఇస్తోంది. ఇంట్లోకి సరుకులు కావాలంటే వెంటనే డీమార్ట్‌కు పరుగులు పెడతారు. అన్నీ వస్తువులు ఒకేచోట లభించడంతో పాటు తక్కువ ధరకే వస్తుండటంతో ఇక్కడ క్యూ కడతారు. దీంతో డీమార్ట్‌కు ఎప్పుడు వెళ్లినా జనంతో రద్దీగా ఉంటుంది. డీమార్ట్‌ అతి తక్కువ ధరలకు సరుకులు ఎలా విక్రయిస్తుందనేది చాలామందికి మిలియన్ల డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

మధ్యలో డిస్ట్రిబ్యూటర్ల మీద ఆధారపడకుండా నేరుగా కంపెనీ నుంచే వస్తువులను డీమార్ట్ కొనుగోలు చేస్తుంది. దీంతో బల్క్‌గా తక్కువ ధరకే వస్తువులు లభిస్తాయి. దీంతో తక్కువ లాభంతో కస్టమర్లకు డీమార్ట్ అమ్ముతోంది. తక్కువకు వస్తున్నాయనే కారణంతో ప్రతీఒక్కరూ కొనుగోలు చేస్తారు. దీని వల్ల కంపెనీకి లాభం పెరుగుతోంది. సరుకులు సరఫరా చేసే కంపెనీలకు డీమార్ట్ వెంటనే బిల్లులు క్లియర్ చేస్తుంది. దీని వల్ల కంపెనీలన్నీ డీమార్ట్‌కు తక్కువ ధరకే వస్తువులన్నీ సరఫరా చేస్తాయి.

అలాగే బల్క్‌గా కొనుగోలు చేయడం వల్ల డిస్కౌంట్స్ కూడా అందిస్తాయి. దీని వల్ల డీమార్ట్‌ కస్టమర్లకు తక్కువ మార్జిన్‌తో వస్తువులను విక్రయించగలుగుతుంది. ఇక డీమార్ట్ తన స్టోర్లను అద్దె భవనాల్లో కాకుండా కేవలం సొంతగా కొనుగోలు చేసిన శాశ్వత భవనాల్లో నడుపుతుంది. దీని వల్ల పెద్ద మొత్తంలో అద్దెలు చెల్లించే బాధ తప్పుతుంది. దీని వల్ల డబ్బులు కూడా అదా అవుతాయి. దీని వల్ల కస్టమర్లకు ఆఫర్లు, డిస్కౌంట్స్ ఇవ్వగలుగుతుంది. ఇక డీమార్ట్ కేవలం ప్రజలకు రోజూవారీ ఉపయోగపడే వస్తువులను మాత్రమే విక్రయిస్తూ ఉంటుంది.

ఇవి ప్రతీఒక్కరికీ అవసరం గనుక కొనుగోలు చేస్తారు. దీంతో డీమార్ట్‌కు కూడా ఆదాయం పెరుగుతుంది. ఇక డీమార్ట్‌కు వచ్చినవారు ఆఫర్లు చేసి ఎక్కువ వస్తువులను కొనుగోలు చేస్తారు. దీని వల్ల సేల్స్ పెరిగి లాభాలు వస్తాయి. బయటి మార్కెట్లతో పోలిస్తే డీమార్ట్‌లో తక్కువ ధరకే వస్తువులు రావడానికి కారణాలు ఇవే.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *