దీపావ‌ళి రోజు జ‌గ‌న్ వేసుకుంది మహిళల షూసేనా..? అసలు ఏంటో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. విదేశీ టూర్ పూర్తి చేసుకొని ఇంటికొచ్చిన జగన్ కుటుంబంతో కలసి ఆనదంగా దీపావళి పండగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన సతీమణితో సరదగా క్రాకర్స్ కాల్చుతూ ఆనందంగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆయన సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ధ‌రించిన షూస్ మ‌హిళ‌లవి అంటూ కొంద‌రు సోష‌ల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

రాజ‌కీయ దురుద్దేశంతో ఇలాంటి నెగిటివ్ పోస్టులు చేస్తున్నారు. ఈ పోస్టులు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. అయితే నిజానికి ఈ ప్ర‌చారంలో ఏమాత్రం నిజం లేదు. కొందరు కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ధ‌రించిన షూల‌ను ఇమేజ్ సెర్చ్ చేసి చూస్తే అవి asics కంపెనీకి చెందిన‌విగా తేలింది. ఈ కంపెనీ ర‌న్నింగ్ షూస్‌ల‌ను త‌యారు చేసే ప్ర‌ముఖ బ్రాండ్‌. ASICS కార్పొరేషన్ జ‌పాన్‌కు చెందిన సంస్థ‌.

ఇది క్రీడా పరికరాల ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందింది. Asics sneakers (రన్నింగ్ షూస్) కోసం ముఖ్యంగా గుర్తింపు పొందింది, కానీ ఈ కంపెనీ సాండల్స్ వంటి ఇతర పాదరక్షలు, అలాగే వస్త్రాలు (టి-షర్ట్స్, జాకెట్లు, హూడీస్, స్విమ్‌వేర్, కంప్రెషన్ గార్మెంట్స్, లెగింగ్స్, సాక్స్) తో పాటు బ్యాగ్స్, బ్యాక్‌ప్యాక్స్, క్యాప్స్ వంటివి కూడా తయారు చేస్తుంది. “Asics” పేరు లాటిన్ పదజాలం anima sana in corpore sano (అర్ధం: “సంతులిత మనస్సు, సౌకర్యవంతమైన శరీరం”) నుంచి రూపొందించారు.

కంపెనీ ప్రధాన కార్యాలయం జపాన్‌లోని కోబే, హ్యోగో ప్రిఫెక్చర్‌లో ఉంది. కంఫ‌ర్ట్‌కి, నాణ్య‌త‌కు పెట్టింది పేరైన ఈ కంపెనీ షూల ధ‌ర ఎక్కువ‌గా ఉంటుంది. వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివ‌రాల ప్ర‌కారం. జ‌గ‌న్ రెడ్డి ధ‌రించిన షూల అస‌లు ధ‌ర రూ. 10,999గా ఉండ‌గా.. డిస్కౌంట్‌లో భాగంగా రూ. 8,799కి అందుబాటులో ఉంది. ఈ షూలు పురుషుల కోస‌మే అని వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

రోజువారీ ఉపయోగానికి అనుకూలంగా ఉండే ఈ న్యూట్రల్ ట్రైనర్ మీ పాదాల కింద‌ ఉన్న కుషనింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి రూపొందించారు. FF BLAST™ PLUS కుషనింగ్ తేలికపాటి, ఉత్సాహభరితమైన రైడ్‌ను అందిస్తుంది. FLUIDRIDE అవుట్‌సోల్ మరింత సాఫీగా, వేగంగా నడిచే అనుభూతిని కలిగిస్తుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *