ప్రతి వారం కంటే ఈ వారం ఎలిమినేషన్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. గత వారం ఎలిమినేషన్ జరగకపోవడంతో, ఈసారి మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ఆడియన్స్ భారీగా అంచనా వేశారు. అయితే అయితే బిగ్ బాస్ నుంచి దివ్య భారీగానే రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.
ఆమె వారానికి రూ.1. లక్షల మేరకు పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.అంటే మొత్తం 9 వారాలకు గానూ రూ.15 లక్షల వరకు సంపాదించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ గా తన ఇన్ స్టా పేజీలో సినిమా రివ్యూస్ చెబుతూ పాపులర్ అయ్యింది. ఆ తర్వాత బిగ్ బాస్ అగ్నిపరీక్షలో సెలక్ట్ అయ్యింది.

కానీ బిగ్ బాస్ హౌస్ లోకి మాత్రం వైల్డ్ కార్డ్ కామనర్ గా అడుగుపెట్టింది. వచ్చిన మొదటి రెండు వారాల వరకు తన ఆట మీద ఫోకస్ చేస్తూ ఫైర్ బ్రాండ్ అనిపించుకున్న దివ్య.. ఆ తర్వాత బంధాల కోసం ఆరాటపడింది. ముఖ్యంగా భరణితో దివ్య స్నేహం మొదట్లో సరిగ్గానే ఉన్నా.. నెమ్మదిగా ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది.
తనూజతో భరణి మాట్లాడితే గొడవ పెట్టేసుకోవడం.. ప్రతిసారి అతడిని డిమాండ్ చేస్తున్నట్లుగా ప్రేక్షకులు భావించారు. దివ్య వచ్చిన తర్వాతే భరణి ఆట తగ్గిందంటూ భరణి ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
