దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట ఎంత ఫేమస్ అనే విషయం అందరికి తెలిసిందే. వీరిద్దరి ప్రేమ కథకు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారంటే అర్థం చేసుకోండి వీరేంత ఫేమసో. వీరిద్దరూ కలిసి ఇచ్చే ఇంటర్వ్యూలు అయితే చాలా పాపులర్ కూడా అయ్యాయి. అయితే భరణి, తనూజ, శ్రష్టి వర్మ, ఫ్లోరా సైనీ, రీతూ చౌదరీ, ఇమ్మాన్యుయెల్, రాము రాథోడ్, సుమన్ శెట్టి, సంజనా గల్రానీ సెలబ్రిటీలుగా హౌస్ లోకి అడుగు పెట్టగా, మర్యాద మనీష్, పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్, దమ్ము శ్రీజ, ప్రియాలు, హరీష్ కామనర్స్ కోటాలో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
కామనర్స్ మెయిన్ హౌస్‌లో ఉంటుండగా, సెలబ్రిటీలు మాత్రం ఔట్ హౌస్ లో ఉన్నారు.మొత్తానికి ఓనర్స్ వెర్సస్ టెనెల్స్ అంటూ కంటెస్టెంట్స్ మధ్య బాగానే పోటీ పెట్టాడు బిగ్ బాస్. అయితే ఈ సీజన్ మొదలు అవ్వకముందే హౌస్ లోకి ఎవరెవరు అడుగుపెట్టబోతున్నారు అనేది సోషల్ మీడియా లో లీక్ అయ్యింది. దాదాపు వారే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు. అయితే మొదటి నుంచి కంటెస్టెంట్ల లిస్టులో వినిపించిన దివ్వెల మాధురి మాత్రం బిగ్ బాస్ 9 హౌస్ లోకి రాలేదు.

ఇటీవలే తన దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఒక కార్యక్రమానికి వెళ్లింది దివ్వెల మాధురి. అక్కడ బిగ్ బాస్ 9 ఆఫర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘నాకు ఆఫర్ వచ్చిన మాట వాస్తవమే. కానీ అన్ని రోజులు నా రాజా కి దూరం గా ఉండడం ఊహిస్తేనే చాలా కష్టం గా అనిపించింది. నేను ఆయన్ని వదిలి అన్ని రోజులు ఉండలేను, ఆయన కూడా ఉండలేడు. అందుకే నేను బిగ్ బాస్ 9 ఆఫర్ ని రిజెక్ట్ చేశాను’ అని చెప్పుకొచ్చింది మాధురి. ఇక ఇదే విషయంపై దువ్వాడ శ్రీనివాస్ కూడా ఓ సందర్భంలో స్పందించారు.
‘మాకు బిగ్‌బాస్ నుంచి కబురు వచ్చింది నిజమే. స్వయంగా బిగ్‌బాస్ టీం వచ్చి మమ్మల్ని కలిసింది. మాధురిని బిగ్ బాస్ లోకి తీసుకుంటామని అడిగారు. అయితే అందుకు ఆమె ఒప్పుకోలేదు. మేమిద్దరం కలిసి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈ టైంలో తను బిగ్‌బాస్‌కి వెళితే.. అంతా డిస్టర్బ్ అవుతుందనిపిస్తోందని.. అందుకే బిగ్ బాస్ ఆఫర్ ను వద్దనుకున్నాం’ అని శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు కాకపోయినా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా నైనా దివ్వెల మాధురి హౌస్ లోకి అడుగు పెట్టనుందని ప్రచారం జరుగుతోంది.