పేరుకు తమిళ దర్శకుడే అయినా సెల్వరాఘవన్ తెలుగు ఆడియెన్స్ కు బాగా పరిచయం. కాదల్ కొండేన్ అనే తమిళ చిత్రంతో దర్శకుడిగా జర్నీ స్టార్ట్ చేశాడు సెల్వ. ఇందులో అతని తమ్ముడు ధనుష్ హీరోగా నటించాడు. ఇక 7/G రెయిన్‌బో కాలనీ (7/G బృందావనం) తో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్.
ఇందులో హీరోయిన్ గా నటించిన సోనియా అగర్వాల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సెల్వ రాఘవన్. 2006లో వీరి పెళ్లి జరిగింది. అయితే ఎక్కువ కాలం కలిసుండలేపోయారు. అయితే సోనియా అగర్వాల్‌తో విడాకుల తర్వాత గీతాంజలిని పెళ్లాడారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు.

గీతాంజలి కూడా ఒక దర్శకురాలు. ‘మాలై నేరత్తు మయక్కం’ సినిమాకు దర్శకత్వం వహించారు. పెళ్లై 14 ఏళ్లు గడిచాక, గీతాంజలి తన ఇన్‌స్టాగ్రామ్ నుండి సెల్వరాఘవన్ ఫోటోలను తొలగించడంతో విడాకుల పుకార్లు వ్యాపించాయి. దీనిపై ఆమె స్పందిస్తేనే స్పష్టత వస్తుంది.
ఇటీవలే సెల్వరాఘవన్ తమ్ముడు ధనుష్ కూడా ఐశ్వర్య రజనీకాంత్‌తో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ధనుష్ లాగే సెల్వరాఘవన్ కూడా విడాకుల బాట పట్టారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
