1990లో రమ్యకృష్ణ స్టార్ డమ్ సంపాదించుకుంది.తన అందంతోపాటు నటనతో తెలుగు తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది రమ్యకృష్ణ. 2003లో డైరెక్టర్ కృష్ణవంశీని ప్రేమించి మరి వివాహం చేసుకున్న రమ్యకృష్ణకు ఒక కుమారుడు కూడా ఉన్నారు. అయితే కొందరు సినీ సెలబ్రిటీస్ దాంపత్య జీవితం మూడునాళ్ల ముచ్చటగా మారుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే కాపురంలో కలహాలు చెలరేగుతున్నాయి. దంపతులుగా ఒకటిగా ఉండలేక విడాకులు తీసుకుంటున్నారు. అలాగే కొన్ని దశాబ్ధాలుగా కలిసి ఉన్న సెలబ్రిటీ కపుల్స్ కూడా ఇప్పుడు విడిపోతున్నారు.
ఈ లిస్టులో తాజాగా సీనియర్ తెలుగు నటి రమ్యకృష్ణ సైతం చేరినట్లు తెలుస్తోంది. ఆమె విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.రమ్యకృష్ణ 2003లో ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. ఇటీవల రమ్యకృష్ణ వైవాహక జీవితానికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భర్త కృష్ణవంశీతో ఆమె విడిగా ఉంటుందని, త్వరలోనే విడాకులు తీసుకోబోతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ కృష్ణవంశీ మాట్లాడుతూ విడాకుల విషయంపై స్పందించాడు. ‘ఓ సినిమా షూటింగ్ కోసం నేను హైదరాబాద్‌లో ఉంటున్నాను. రమ్యకృష్ణ చెన్నైలో ఉంటోంది. దీంతో మేం విడివిడిగా జీవిస్తున్నామని కొందరు పనికట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలా ఒక కుటుంబం గురించి తప్పుడు ప్రచారం చేయడం శాడిస్ట్ తనమవుతుంది. ఇదంతా చూస్తుంటే నాకు నవ్వు వస్తోంది. మేమిద్దరం కలిసే ఉంటున్నాం. విడాకుల తీసుకుంటామని వస్తున్న వార్తల్లో నిజం లేదు.’ అని చెప్పాడు.
అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు రమ్యకృష్ణ స్పందించలేదు. ఆమె కూడా క్లారిటీ ఇస్తే, ఈ ఫేక్‌న్యూస్‌కు పుల్‌స్టాప్ పడుతుంది. 14 ఏళ్ల వయసులో ఎంట్రీ రమ్యకృష్ణ 40 పదుల వయసులోనూ సినిమా ఆఫర్స్ వరుసగా దక్కించుకుంటూ బిజీబిజీగా గడుపుతోంది. బహుబలి సిరీస్‌లో శివగామి పాత్రలో ఆమె నటన నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. ఈ సినిమాతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. రమ్యకృష్ణ 14 ఏళ్ల వయసులో ‘పాలె మిత్రులు’ అనే తెలుగు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది.