ఎన్నో ఏళ్లుగా కలిసి ఉన్న జంటలు కూడా ఊహించని విధంగా విడాకులు తీసుకుంటున్నాయి. వారిలో ధనుష్,ఐశ్వర్య జంట ఒకటి. సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యతో ధనుష్ వివాహం 2004 లో ఎంతో అట్టహాసంగా జరిగింది. ఈ క్యూట్ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే దర్శకుడు, నిర్మాత కస్తూరి రాజా చిన్న కొడుకు ధనుష్. రజినీ కాంత్ కూతురు ఐశ్వర్యలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాల అగీకారంతో వీరి వివాహం ఘనంగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే.
ధనుష్, ఐశ్వర్యను పెళ్లి చేసుకునేటప్పుడు పెద్ద హీరో కాదు. కానీ వివాహం తర్వాత ధనుష్ స్టార్ అయ్యాడు. పెళ్లి తర్వాత దర్శకుడు, నిర్మాతగా ఎదిగాడు. ధనుష్ ఎదుగుదలకు ఐశ్వర్య కారణం అనడంలో సందేహం లేదు. తన నటనతో కోలీవుడ్ దాటి టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ వరకు వెళ్ళాడు. 20 ఏళ్ల పాటు సంతోషంగా ఉన్న ఈ జంటకు ఇద్దరు కుమారులు. 2022లో వీరిద్దరూ విడిపోతున్నట్టు వార్త అందరికి షాక్ ఇచ్చింది. ధనుష్, హీరోయిన్లతో సన్నిహితంగా ఉండటమే విడాకులకు కారణం అని కొందరు, ఐశ్వర్య ధనుష్ కుటుంబాన్ని గౌరవించకపోవడమే కారణం అని మరికొందరు అన్నారు.
కానీ ధనుష్, ఐశ్వర్య మాత్రం ఈ విషయంపై మాట్లాడలేదు. పిల్లల కోసం కలిసి ఉండాలని కుటుంబ సభ్యులు కోరుకున్నారు. రాజీ చర్చలు జరిగినా, ఇద్దరూ విడాకులకు సిద్ధమే అన్నారు. కొన్ని నెలల క్రితం ఐశ్వర్య చెన్నై కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. అక్టోబర్ 6న విచారణ జరిగింది. ధనుష్, ఐశ్వర్య కోర్టుకు హాజరు కాలేదు. విచారణ అక్టోబర్ 19కి వాయిదా పడింది. ఈరోజు కూడా ఈ ఇద్దరూ హాజరు కాలేదు. తాజా సమాచారం ప్రకారం, ధనుష్, ఐశ్వర్య విడాకుల నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటునట్లు తెలుస్తోంది. రజనీకాంత్ ఆరోగ్యమే ఇందుకు కారణం అని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
రజనీకాంత్ అనారోగ్యానికి కుటుంబ సమస్యలే కారణం అనే చర్చ జరుగుతున్న తరుణంలో, తండ్రి మనశ్శాంతి కోసం ఐశ్వర్య ఈ నిర్ణయం తీసుకున్నారట. పిల్లలు కూడా తల్లిదండ్రులు కలిసి ఉండాలని కోరుకుంటున్నారట. రజనీకాంత్ కి జైలర్ సినిమాకి శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా, ఐశ్వర్య సినిమా చూసిన థియేటర్ లోనే ధనుష్ కూడా సినిమా చూశాడు. ఇవన్నీ చూస్తుంటే, మళ్ళీ కలిసి ఉండటానికి సిద్ధమైనట్టు.. త్వరలో శుభవార్త వస్తుందని తెలుస్తోంది.