దిశా పటానీ.. కోత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌపాల చౌరాహా సమీపంలో ఉన్న ఆమె నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. కానీ, కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే తాజాగా ఓ స్టార్ హీరోయిన్ ఇంటిముందు కాల్పులు కలకలం రేపాయి. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ అందాల భామ దిశా పటని ఈ షాకింగ్ ఇన్సిడెంట్ ఉత్తరప్రదేశ్ లోని బరేల్లీలో జరిగింది.
సెప్టెంబర్ 12, 2025 ఉదయం సుమారు 3-4:30 గంటల మధ్య, బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు దిశా పటానీ ఇంటి పై ముందు 6-7 రౌండ్ల కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు. కానీ ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ కాల్పులకు కారణం దిశా సోదరి ఖుష్బూ పటానీ ఇన్‌స్టాగ్రామ్‌లో జూలైలో పోస్ట్ చేసిన కామెంట్స్.
ఆమె హిందూ సాధువులైన ప్రేమానంద్ మహారాజ్ అలాగే అనిరుద్ధాచార్య మహారాజ్‌పై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిందని తెలుస్తుంది. ఇది లైవ్-ఇన్ రిలేషన్‌షిప్స్ గురించి అనిరుద్ధాచార్య వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఆమె కొన్ని కామెంట్స్ చేసింది. దాంతో కొందరు ఆగ్రహించి ఈ పని చేశారని తెలుస్తుంది. కాగా ఈ కాల్పులు జరిగిన సమయంలో దిశా తల్లిదండ్రులు (తండ్రి జగదీష్ పటానీ, రిటైర్డ్ DSP), దిశా సోదరి ఖుష్బూ ఇంట్లో ఉన్నారు.
దిశా ముంబైలో షూటింగ్‌లో ఉండటంతో ఆమె అక్కడ లేదని తెలుస్తుంది. గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్, రోహిత్ గోదారా గ్యాంగ్ సభ్యులు విరేంద్ర చారణ్, మహేంద్ర సరణ్ ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా ఈ కాల్పులు చేసింది తామే అని ఒప్పుకున్నారు. పోస్ట్‌లో “సనాతన ధర్మానికి అవమానం చేస్తే మరింత తీవ్ర చర్యలు తీసుకుంటాం, ఇది ట్రైలర్ మాత్రమే” అని హెచ్చరించారు. దిశా తండ్రి ఫిర్యాదు మేరకు FIR నమోదు చేశారు పోలీసులు.
దిశా ఇంటి చుట్టూ సెక్యూరిటీ పెంచారు. దాడి చేసినవారు ఢిల్లీ-లక్నో హైవే ద్వారా పారిపోయారని, ముందుగా రికీ చేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.