Director Shankar: డైరెక్టర్ శంకర్ దెబ్బకు సినిమాలకు పూర్తిగా దూరమైనా నిర్మాత, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే..?

divyaamedia@gmail.com
3 Min Read

Director Shankar: డైరెక్టర్ శంకర్ దెబ్బకు సినిమాలకు పూర్తిగా దూరమైనా నిర్మాత, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే..?

Director Shankar: డైరెక్టర్ శంకర్..ఎంతోమంది 80s, 90s కిడ్స్ కి స్టార్ డైరెక్టర్. స్టార్ డైరెక్టర్ గా ఇప్పుడు రాజమౌళి అందుకుంటున్న జేజేలు శంకర్ తన సినిమాలతో ఎప్పుడో అందుకున్నాడు. కానీ ఇదంతా గతం. తాజాగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు 2 సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో శంకర్ మరోసారి చర్చగా మారారు. అయితే అయితే ఎంత పెద్ద టాలెంటెడ్ ఆర్టిస్టుకి అయినా, డైరెక్టర్ కి అయినా ఎదో ఒక సమయంలో టీం సరిగా కుదరక గడ్డు కాలం నడుస్తుంది. అది మనం చాలా మందిలో చూసాం. ఇప్పుడు డైరెక్టర్ శంకర్ విషయంలో చూస్తున్నాం. సూపర్ స్టార్ రజినీకాంత్ తో తీసిన రోబో చిత్రం తర్వాత శంకర్ గ్రాఫ్ చిన్నగా తగ్గుతూ వచ్చింది.

Also Read: 50 ఏళ్ల వయసులో కొత్త బాయ్ ఫ్రెండ్‏ను పరిచయం చేసిన స్టార్ హీరోయిన్.

హిందీ లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిన ‘3 ఇడియట్స్’ చిత్రాన్ని తమిళం లో విజయ్ తో తీసాడు. అదే సినిమా ఇక్కడ ‘స్నేహితుడు ‘ అనే పేరుతో విడుదలైంది. ఈ చిత్రం కమర్షియల్ గా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత శంకర్ తీసిన రోబో 2.0 టేకింగ్ పరంగా ఔరా అనిపించినప్పటికీ స్టోరీ లైన్ బాగా వీక్ అవ్వడంతో వెయ్యి కోట్ల రూపాయలకు పైగా రాబట్టాల్సిన ఈ సినిమా, 800 కోట్ల రూపాయిల దగ్గరే ఆగిపోయింది. ఈ సినిమాతోనే అందరికీ అర్థం అయ్యింది, ఇక శంకర్ పని అయిపోయింది అని. ఇక రీసెంట్ గా విడుదలైన ‘ఇండియన్ 2 ‘ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

‘ఇండియన్’ లాంటి కల్ట్ క్లాసిక్ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఎంత ఘోరమైన డిజాస్టర్ గా నిల్చిందో మనమంతా చూసాము. అసలు ఈ చిత్రానికి నిజంగా శంకర్ దర్శకత్వం వహించాడా? అనే అనుమానాలు అందరిలో తలెత్తాయి. అంత చెత్తగా ఈ చిత్రాన్ని తీసాడు. ఇప్పుడు రామ్ చరణ్ తో తీస్తున్న ‘గేమ్ చేంజర్’ చిత్రం పరిస్థితి ఏమిటో అని రామ్ చరణ్ అభిమానులు వణికిపోతున్నారు. ఇదంతా పక్కన పెడితే ఏవీఎమ్ సంస్థ మీ అందరికీ గుర్తుందా..?, ఎన్టీఆర్, ఎంఎన్నార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ కాలం నుండి వీళ్ళు సినిమాలు నిర్మిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ సంస్థ సినిమాలు చెయ్యడం పూర్తిగా ఆపేసి, కేవలం టీవీ సీరియల్స్ కి మాత్రమే పరిమితమైంది.

Also Read: ఆ చిన్న పొరపాటే ఆర్తి అగర్వాల్ ప్రాణం తీసిందా..! మరణం వెనుక అసలు నిజం ఇదే.

అందుకు కారణం శంకర్ అట. అప్పట్లో ఏవీఎమ్ సంస్థ రజినీకాంత్ – శంకర్ కాంబినేషన్ లో శివాజీ అనే చిత్రం చేసింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్టే. అందులో ఎలాంటి సందేహం లేదు, కానీ ప్రొడక్షన్ కాస్ట్ పరంగా ఫెయిల్యూర్ అని అప్పట్లో బాగా వినిపించిన వార్త. అవసరానికి మించి ఖర్చు పెట్టించడం వల్ల అప్పటి మార్కెట్ ఇంకా ఆ స్థాయికి రాకపోవడంతో, ప్రీ రిలీజ్ బిజినెస్ ఆ స్థాయిలో జరగలేదు. దీంతో నిర్మాత నష్టపోవాల్సి వచ్చింది, అప్పటి నుండి సినిమాలకు దూరంగా ఉంటూ కేవలం టీవీ షోస్ కి పరిమితమైంది ఏవీఎమ్ సంస్థ.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *