హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు నుండి క్రిష్ వెళ్లిపోవ‌డానికి గ‌ల కార‌ణం ఇదే..!

divyaamedia@gmail.com
2 Min Read

ఈ సినిమా అనౌన్స్ అయిందేమో ఆరేళ్ల కిందట. అప్పుడు ఆ చిత్రానికి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ఆయన నాలుగేళ్లకు పైగా ఆ సినిమాతో అసోసియేట్ అయ్యే ఉన్నాడు. నిర్మాత ఏ ఎం ర‌త్నం ఓ ఇంట‌ర్వ్యూలో తన మనసులోని విషయాలను వెల్లడించారు. మా సినిమా దాదాపు 14 సార్లు వాయిదా పడిందంటూ మీడియాలో వార్తలు రావ‌డం చాలా బాధించింది. కోపం కూడా వ‌చ్చింది. నిజానికి మా సినిమా విడుదలను కేవలం మూడు సార్లు మాత్రమే మార్చామన్నారు. మార్చి 28, మే 9, జూన్ 12 తేదీల్లో విడుదల చేయాలనుకున్నాం.

అయితే జూన్ 12న విడుదల చేయలేకపోయినప్పుడు నాకు వ్యక్తిగతంగా ఎంతో బాధేసింది. నా కెరీర్‌లో ఇప్పటివరకు ఏ సినిమాని కూడా ఒక్కసారి కూడా వాయిదాలేదు అని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ చాలా భారీ స్థాయిలో ఉంది. ‘బాహుబలి’ వంటి సినిమాలు కూడా వీఎఫ్‌ఎక్స్ పనుల వల్లే ఆలస్యం అయ్యాయి. అలాగే కోవిడ్-19, తర్వాత ఎన్నికల ప్రభావం వల్ల కొంతకాలం షూటింగ్ ఆగిపోయింది.

మాకు ఎదురైన ఆలస్యం వెనుక వ్యాపార పరమైన కారణాలు లేవు అని ఏఎం రత్నం తేల్చిచెప్పారు. పవన్ కల్యాణ్ గారు రాజకీయాలలో కాస్త‌ బిజీగా ఉండటం వలన రిలీజ్ డేట్ విషయంలో ప‌క్కా క్లారిటీ ఇవ్వ‌లేక‌పోయాం అని ఆయ‌న పేర్కొన్నారు. ఇక ఈ చిత్రాన్ని మొద‌ట క్రిష్ తెర‌కెక్కించ‌గా, త‌ర్వాత ఏఎం ర‌త్నం ద‌ర్శ‌కుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేశాడు. అయితే ఈ ప్రాజెక్టు నుంచి క్రిష్ వెళ్లిపోవడానికి కారణం, ఆయనకి మరో కమిట్ మెంట్ ఉండటమే అని తెలియ‌జేశారు ర‌త్నం.

జ్యోతికృష్ణ‌కి ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ని అప్ప‌గించాల‌ని చెప్పింది కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారే. ఇక సినిమా విడుద‌ల‌కి నాలుగు రోజుల ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తాము. వ‌ర్షాలు లేని ప‌క్షంలో తిరుపతిలో చేస్తాము. ఒక వేళ వ‌ర్షాలు ఉంటే విజయవాడ ఇండోర్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాము అని ఏఎం ర‌త్నం తెలియ‌జేశారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *