దిల్ రాజు భార్య తేజస్విని గతంతో పోల్చితే తన వ్యక్తిగత జీవితంలోనూ, వృత్తిపరమైన విషయాలల్లోనూ ఓపెన్‌గా మాట్లాడుతూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారింది. ఇటీవల భర్తతో కలిసి పారిస్‌కి వెకేషన్‌కి వెళ్లిన సందర్భంగా అక్కడి ఫొటోలు తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి నెటిజన్లను ఆకట్టుకుంది.ఇదిలా ఉండగా, పెళ్లి తర్వాత తొలిసారి ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తేజస్విని తన చదువు, కెరీర్, ప్రేమ, పెళ్లి వంటి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది.
అయితే దిల్ రాజు మొదటి భార్య అనిత గుండెపోటుతో 2017లో మరణించిన విషయం తెలిసిందే. దీంతో కొన్నాళ్ల పాటు దిల్ రాజు ఒంటరిగానే జీవించారు. ఇక ఆ తర్వాత దిల్ రాజు కరోనా సమయంలో తేజస్విని అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నారు. ఆపై ఈ జంట మగ బిడ్డకు జన్మనిచ్చారు. దిల్ రాజు ఓ సమయంలో విమాన ప్రయాణం చేసే సమయంలో తేజస్విని పరిచయం అయిందట. ఆ తర్వాత ఫోన్ నెంబర్ తీసుకొని దాదాపు ఏడాది పాటు ఆమెతో మాట్లాడుతూ.. తనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారట దిల్ రాజు.
తేజస్వి ఎయిర్ లైన్స్‌లో పనిచేస్తున్న సమయంలో, ఆయన రెగ్యులర్‌గా ట్రావెల్ చేసేవారు. మొదటిసారి ఆమెను కలిసినప్పుడు పెన్ ఉందా అని అడిగారట దిల్ రాజు. అలా వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందట. ఆపై అది పెళ్లి దాకా వచ్చి ఇద్దరూ ఒక్కటయ్యారు. తేజస్వికి దిల్ రాజు ఎవరో కూడా తెలియదట. దర్శకుడేమో అనుకొని.. గూగుల్‌లో వెతికితే నిర్మాత అని తెలిసిందట. ఆయనకు ఆల్రెడీ పెళ్లయి కూతురుందని తెలిశాక నేను వెనకడుగు వేసిందట. అయితే దిల్ రాజు ఆమె పెద్దమామయ్యను ఒప్పించి మరీ తేజస్విని పెళ్లి చేసుకున్నారట.
అంటే దిల్ మామా లవ్ స్టోరీ సినిమా లెవల్లో ఉందన్నమాట. గతంతో పోల్చితే దిల్ రాజు భార్య తేజస్విని ఓపెన్‌గా మాట్లాడుతూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారింది. ఇటీవల భర్తతో కలిసి పారిస్‌కి వెకేషన్‌కి వెళ్లిన ఆమె.. అక్కడి ఫొటోలు తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఈ పిక్స్ వైరల్ అయ్యాయి. తేజస్విని చదువు, ఇతర విషయాలకొస్తే.. ఆమె హైదరాబాద్‌లో పుట్టి పెరిగింది. విద్యాభ్యాసం మొత్తం గర్ల్స్ ఇన్‌స్టిట్యూషన్లలోనే సాగింది. స్కూలింగ్ సెయింట్ ఆన్స్‌లో, ఇంటర్ శ్రీ చైతన్యలో పూర్తయ్యింది.
డిగ్రీను కస్తూరిబా గాంధీ కళాశాలలో చేసి, నాచారంలోని సెయింట్ పియస్ కళాశాలలో బయోకెమిస్ట్రీలో పీజీ పూర్తి చేసింది. అమ్మ హైకోర్ట్ అడ్వకేట్ కావడంతో ఆమెకు లా పట్ల ఆసక్తి పెరిగిందట. దీంతో పీజీ తర్వాత పెండేకంటి లా కాలేజీలో లా చదివింది. ఆ సమయంలోనే దిల్ రాజు గారితో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కూడా చదువుతూనే 2024లో లా పూర్తి చేసింది తేజస్వి. తేజస్వినికి కళలపై కూడా మంచి పట్టు ఉంది. ఆమె ఓ క్లాసికల్ డాన్సర్ కూడా.