మంగళవారం రోజున టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఇళ్లతో పాటు ఆయన కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇక రెండో రోజు శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌తో మొదలైన తనిఖీలు, మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా సంస్థలపై కూడా విస్తృతంగా కొనసాతున్నాయి. అయితే టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్, దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి, దర్శకుడు అనిల్ రావిపూడి నివాసాల పై ఐటి అధికారులు సోదాలు చేశారు.
దిల్ రాజు ఇల్లు ఆఫీసులతో పాటు ఆయన కూతురు ఇల్లు, బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. పుష్ప2 మూవీ నిర్మాతలు మైత్రీ సంస్థ మీద కూడా ఐటి దాడులు కొనసాగాయి. మైత్రీ నవీన్, సీఈఓ చెర్రీ, మైత్రి సంస్థ భాగస్వాముల ఇళ్లల్లో సోదాలు చేశారు ఇన్ కం టాక్స్ అధికారులు. మరోవైపు టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత భర్త రాముకు సంబంధిన మాంగో మీడియా సంస్థలో సైతం సోదాలు నిర్వహించారు.
అయితే ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులపై ఇలా ఒక్కసారిగా ఐటీ దాడులు చేయడం సంచలనంగా మారింది. ఈ దాడుల్లో ఏమైనా దొరికాయా ? అధికారులు ఏమైనా సీజ్ చేశారా అనేది ఇంకా తెలియలేదు. మరోవైపు ఐటీ రైడ్స్ పై దిల్ రాజు భార్య తేజస్విని స్పందించారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. తమ ఇంటిపై ఐటీ దాడులు జరిగాయన్నారు. తనను బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయడానికి ఐటి వాళ్ళు తీసుకెళ్లారన్నారు.
ఐటీ సోదాలు జనరల్ గా జరిగే సోదాలు మాత్రమే.. అన్నారు. ఐటీ శాఖ అధికారులు బ్యాంక్ డీటెయిల్స్ కావాలని అడిగారన్నారు. .బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేసి చూపించామన్నారు దిల్ రాజ్ భార్య తేజస్విని. అయితే తెలంగాణ ప్రభుత్వంలో ఫిలిం డైరెక్టర్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఉన్న దిల్ రాజు ఇల్లు, ఆఫీసులపై కూడా ఐటీ దాడులు జరగడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.