Diamond found: కర్నూలులో రైతుకు దొరికిన వజ్రం, రికార్డ్ ధరకు అమ్ముడైన వజ్రం.

divyaamedia@gmail.com
2 Min Read

Diamond found: కర్నూలులో రైతుకు దొరికిన వజ్రం, రికార్డ్ ధరకు అమ్ముడైన వజ్రం.

Diamond found: వర్షాకాలంలో కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వజ్రాలు లభ్యమవుతుంటాయి. కర్నూలు జిల్లా తుగ్గలి, మద్దికెర మండలాల్లోని తుగ్గలి, జొన్నగిరి, పెరవలి, పగిడిరాయి, కొత్తపల్లి, మద్దికెర, అగ్రహారం, హంప, యడవలి గ్రామాల్లో వజ్రాలు లభ్యమవుతుంటాయి. ఇటు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని తట్రకల్లు, రాగులపాడు, గంజికుంట, పొట్టిపాడు, గూళపాళ్యం, కమలపాడు, ఎన్‌ఎంపీ తండాతో పాటూ మరికొన్ని గ్రామాల్లో వజ్రాలు దొరుకుతాయి. అందుకే ప్రతి ఏటా వర్షాలు పడగానే రైతులు, కూలీలు వజ్రాల కోసం గాలిస్తుంటారు.

Also Read: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్, భారీగా దిగొచ్చిన పసిడి ధరలు.

అయితే కర్నూలు జిల్లాలో మరో రైతును అదృష్టం వరించింది. చాలా రోజుల తర్వాత పొలంలో వజ్రం దొరికింది. అయితే జిల్లాలో భారీ వర్షాలు పడటంతో వజ్రాల వేట మళ్లీ మొదలైంది.. ఈ క్రమంలో వజ్రాలు దొరుకుతున్నాయి. తుగ్గలి మండలం జొన్నగిరిలో పొలం పనులకు వెళ్లిన బోయి రామాంజనేయులుకు ఓ రాయి దొరికింది. వెంటనే దానిని తీసుకొని జొన్నగిరికి చెందిన వజ్రాల వ్యాపారి వద్దకు పరుగెత్తాడు. అది వజ్రమేనని తేల్చిన వ్యాపారి రైతుకు 12 లక్షల రూపాయల నగదు, 5 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేశాడు.

Also Read:బొమ్మ అనుకుని పామును కొరికి చంపిన బుడ్డోడు, ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చుడండి.

రైతు అదృష్టానికి ఎంతో సంతోషించాడు. చిన్నప్పటినుంచి కష్టాలనే చూసిన రామాంజనేయులు ఈ వజ్రం తన కష్టాలన్నీ తీర్చుతుందని ఆనందం వ్యక్తం చేశాడు. రామాంజనేయులు బోయ, శేఖర్‌ అన్నదమ్ములు. వీరికి రెండు ఎకరాల పొలం ఉంది. అదే సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పొలంలో పనుల్లేనప్పుడు డ్రైవర్లుగా పనిచేసుకుని బ్రతుకుతారు. ఎప్పటిలాగే ఉదయం పొలం పనులకు వెళ్లిన రామాంజనేయులుకు వజ్రం దొరికింది. రాత్రికి రాత్రి అతన్ని లక్షాధికారిని చేసింది. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో భారీ వర్షాలు రావడంతో దాదాపుగా ఇప్పటి వరకు 42 వజ్రాలు లభ్యమయ్యాయి.

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *