షూటింగ్ సందర్భంగా నటి శరణ్యతో కలిసి ధనుష్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నటి శరణ్యతో ధనుష్ ఓ డ్యాన్స్ స్టెప్పు వేశాడు. ఓ రెట్రో సాంగ్‌కు వారిద్దరు కలిసి చేసిన డ్యాన్స్ ఆకట్టుకుంటుంది. అయితే హీరోగా దక్షిణాదిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ధనుష్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. హీరోగానే కాకుండా సింగర్ గానూ అదరగొట్టేశాడు. అంతేకాదు.. ఇటు దర్శకుడిగానూ సక్సెస్ అయ్యాడు.
ఇప్పటికే రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన ధనుష్.. ఇప్పుడు మూడో సినిమాను తెరకెక్కించారు. అదే నిలవుక్కు ఎన్మేల్ ఎన్నడి కోపం. అదే తెలుగులో జాబిలమ్మా నీకు అంత కోపమా. తమిళంతోపాటు తెలుగులోనూ విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. షూటింగ్ సమయంలో నటి శరణ్య పొన్వన్నన్, హీరో భవిష్ డ్యాన్స్ చేసే సీన్ ధనుష్ రీక్రియేట్ చేశాడు.
ఈ వీడియో నిన్న, 22వ తేదీ, 2025న విడుదలైంది. ధనుష్ మేనల్లుడు పవిష్ కంటే నటుడు ధనుష్ డ్యాన్స్ చాలా బాగుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. నటి శరణ్య పొన్వన్నన్ జాబిలమ్మా నీకు అంత కోపమా సినిమాలో హీరో పవిష్ తల్లిగా నటించింది. ఇందులో తన కొడుకుతో కలిసి నటి శరణ్య డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ధనుష్, శరణ్య చేసిన రిహార్సల్స్ వీడియో ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతుంది.
ఈ వీడియో చూసిన అభిమానులు.. ఇందులో హీరో భవిష్ డ్యాన్స్ కంటే ధనుష్, శరణ్య డ్యాన్స్ బాగుందని.. మరోసారి రఘువరన్ బీటెక్ సినిమాను చూసినట్లుగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
Director @dhanushkraja sir 🤍#Neek #NilavukuEnMelEnnadiKobam pic.twitter.com/dSdg7fnXGd
— Chowdrey (@Chowdrey_) February 21, 2025