బిగ్ బాస్ బ్యూటీ రష్మీ దేశాయ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. క్యాస్టింగ్ కౌచ్.. ఒకానొక సమయంలో నేనూ ఫేస్ చేశాను. అప్పుడు నా వయసు 16 ఏళ్లు. ఆడిషన్ ఉందని పిలిస్తే వెళ్లాను. అక్కడున్న వ్యక్తి నేను స్పృహ కోల్పోయేలా చేయడానికి ప్రయత్నించాడు. అయితే రష్మీ దేశాయ్.. హిందీలో పలు సీరియల్స్ ద్వారా పాపులర్ అయ్యారు. అలాగే బిగ్ బాస్ షోలోను పాల్గొన్నారు.
గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. కెరీర్ మొదట్లో ఎదురైన అనుభవాలను చెప్పుకొచ్చింది. రష్మీ మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలిరోజుల్లో నన్ను ఆడిషన్ కోసం పిలిచారు. అది నాకు ఇంకా గుర్తుంది. అక్కడికి వెళ్లినప్పుడు నేను తప్ప మరెవరు లేరు. నా వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. ఆ సమయంలో ఓ వ్యక్తి నాకు మత్తు మందు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేయడానికి ప్రయత్నించాడు.
నేను వెంటనే అక్కడి నుంచి పారిపోయి బయటకు వచ్చాను. ఆ తర్వాత నా తల్లికి ప్రతి విషయం చెప్పాను ” అంటూ తెలిపింది. అలాగే తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత ఆర్థిక కష్టాలను చూశానని వెల్లడించింది. దాదాపు 2.5 కోట్లు లోన్ తీసుకుని సొంతంగా ఇల్లు కొన్నానని.. తన పేరు మీద మొత్తం 3.25 కోట్ల వరకు అప్పు ఉందని.. అదే సమయంలో తాను చేస్తోన్న షో ఆగిపోవడంతో పరిస్థితి దారుణంగా మారిందని చెప్పుకొచ్చింది.
ఎక్కడికి వెళ్లాలి.. ఎక్కడ ఉండాలో తెలియరాలేదని.. దీంతో తన ఆడి ఏ6 కారులోనే నాలుగు రోజులు ఉన్నానని తెలిపింది. ఈ బ్యూటీ కెరీర్ మొదట్లో కొన్ని బీ గ్రేడ్ చిత్రాల్లోనూ నటించింది.