చనిపోయిన వారి ఫోటోలను ఇంట్లో పెట్టుకోవచ్చా..? వెంటనే తీసేయండి.. లేదంటే జరిగేది ఇదే.

divyaamedia@gmail.com
2 Min Read

జ్యోతిష శాస్త్రం ప్రకారం, మన పూర్వీకులు ఏదైనా కారణం చేత అసంతృప్తిగా ఉన్నప్పుడు, వారి అసంతృప్తి పితృదోషంగా మారి మన జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ దోషం వల్ల కుటుంబంలో తరచూ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, అదృష్టహీనత వంటివి ఎదురవుతాయి. కొన్నిసార్లు, పూర్వీకులు చేసిన పాపాల ప్రభావం తరతరాల వరకు కుటుంబ సభ్యులు అనుభవించాల్సి వస్తుంది.

అందుకే, పితృపక్షం సమయంలో పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడం, వారికి తర్పణాలు వదలడం అనివార్యంగా భావిస్తారు. అయితే ఇంట్లో చనిపోయిన పెద్దల ఫొటోలను పెట్టుకోవడం సర్వసాధారణమైన విషయం. అయితే ఈ ఫొటోలో విషయంలో కొన్ని వాస్తు నియమాలను పాటించాలని సూచిస్తున్నారు. పూర్వీకుల ఫొటోలోను ఇంట్లో ఏర్పాటు చేసుకునే సమయంలో కొన్ని రకాల తప్పులను చేయకూడదని అంటున్నారు.

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో పూర్వీకుల ఫొటోలను పెట్టడానికి దక్షిణ దిశ మంచిదని నిపుణులు చెబుతున్నారు. దక్షిణ దిశను యముడి దిక్కుగా పరిగణిస్తారు. అందుకే చనిపోయిన వారి ఫొటోలను ఈ దిశలో పెట్టడం మంచిదని వాస్తు శాస్త్రం చెబుతోంది. అయితే కొందరు పూజ గదిలో కూడా పూర్వీకుల ఫొటోలను పెడుతుంటారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని వాస్తు పండితులు చెబుతున్నారు.

కాబట్టి పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లో చనిపోయిన వారి ఫొటోలను పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇక చనిపోయిన వారి ఫొటో విరిగిపోకుండా చూసుకోవాలి. అద్దం పగిలిన ఫొటోలను ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు. ఫొటో ఫ్రేమ్‌ విరిగినా, పాడైపోయినా వెంటనే వెంటనే తొలగించి కొత్త ఫొటోలను ఏర్పాటు చేసుకోవాలి.

ఇక చనిపోయిన ఒకే వ్యక్తికి సంబంధించిన ఎక్కువ ఫొటోలను ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అలాగే పూర్వీకుల ఫొటోలను తూర్పుకు అభిముఖంగా పెట్టడం కూడా మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. దక్షిణ గోడకు ఏర్పాటు చేసి ఫొటో ఉత్తరం అభిముఖంగా ఉండడం బెస్ట్‌ అని చెబుతున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *