1976లో వచ్చిన పట్టిన ప్రవేశం చిత్రంలో కె. బాలచందర్ ఆయనని తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు. 1981లో వచ్చిన ఎంగమ్మ మహారాణి చిత్రంలో గణేష్ హీరోగా నటించాడు. అయితే సౌత్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఢిల్లీ గణేష్. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 400కు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో అద్భుతమైన నటనతో జనాల హృదయాలు గెలుచుకున్నారు. 1976లో విడుదలైన ‘పట్టిన ప్రవేశం’తో ప్రారంభించారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ దర్శకత్వం వహించారు. సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టకముందు ఆయన 1964 నుంచి 1974 వరకు భారత వైమానిక దళంలో పనిచేశారు. కానీ చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండడంతో తన పదవికి రాజీనామా చేసి సినీరంగంలోకి అడుగులు వేశారు.

అదే సమయంలో ఢిల్లీలో ఉన్న థియేటర్ గ్రూప్ అయిన దక్షిణ భారత్ నాటక సభ ఆయన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సహాయపడింది. కెరీర్‌లో హీరో నుండి విలన్ వరకు విభిన్న పాత్రలను పోషించి, నటుడిగా తన అద్భుతమైన నటనతో మెప్పించారు. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించారు.
ఆయన ‘ఎంగమ్మ మహారాణి’ (1981)లో కథానాయకుడిగా నటించారు. తరువాత ‘అపూర్వ భ్రాంతనాల్’లో ప్రతినాయక పాత్రను పోషించారు. ‘నాయగన్’ (1987), ‘మైఖేల్ మదన కామ రాజన్’ (1990), ‘అపూర్వ సగోదరర్గల్’ (1989), ‘తెనాలి’ (2000) మరియు ‘ధృవంగల్ పతినారు’ (2016) వంటి చిత్రాలతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలే కాకుండా బుల్లితెరపై సీరియల్స్ ద్వారా ఫేమస్ అయ్యారు.