బాలీవుడ్ సూపర్ స్టార్స్ రణ్ వీర్ సింగ్, దీపికా పదుకుణే ల జంట దీపావళి వేడుకులను వైభవంగా జరుపుకున్నారు. ఈ సారి వారి జీవితంలోకి కూతురు దువా రావడంతో వారి ఆనందానికి అవధులు లేవు. అయితే దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్ దీపావళి సందర్భంగా అభిమానులకు ఉత్తమ బహుమతిని అందించారు.
ఈ జంట మంగళవారం తమ కుమార్తె దువా పదుకొనే సింగ్ ఫేస్ రివీల్ చేశారు. దీపికా, దువా ఇద్దరూ మెరూన్ కలర్ దుస్తులు ధరించగా.. రణవీర్ సింగ్ తెల్లటి కుర్తా పైజామాలో ధరించి అందమైన చిరునవ్వులతో కట్టిపడేస్తున్నారు. దీపిక, రణ్‌వీర్ దంపతులకు సెప్టెంబర్ 8, 2024న జన్మించిన సంగతి తెలిసిందే. వీరిద్దరు 2018లో వివాహం చేసుకున్నారు.

గత దీపావళి సందర్భంగా, వారు తమ కుమార్తె పేరు దువా పదుకొనే సింగ్‌ను ప్రపంచానికి పరిచయం చేశారు. “దువా: అంటే ప్రార్థన. ఎందుకంటే ఆమె మా ప్రార్థనలకు సమాధానం. మా హృదయాలు ప్రేమ, కృతజ్ఞతతో నిండి ఉన్నాయి” అని రాశారు. ప్రస్తుతం దీపికా షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.
ముఖ్యంగా తమ కూతురు దువా అందమైన చిరునవ్వుకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. దీపికా పోస్టులపై అభిమానులు, సినీప్రముఖులు రియాక్ట్ అవుతున్నారు. అనన్య పాండే, “ఓ మై గాడ్ 😍😍😍😍😍” అని కామెంట్ చేశారు. అలాగే దువా ఎంతో అందంగా, ముద్దుగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
