సహజంగా చావును చెడుగా భావిస్తాం, కలలో చనిపోయిన దృశ్యాలు కనిపిస్తే భయపడతాం. కానీ కలలో మీరు చనిపోయినట్లు కనిపిస్తే మంచిదేనని శాస్త్రం చెబుతోంది. మీరు చనిపోయినట్లు మీకే కల వస్తే.. మీ జీవితంలో జరుగుతున్న సమస్యలు త్వరలో ముగుస్తాయని అర్థం. త్వరలోనే మీకు విజయం దక్కబోతుందని అని చెప్పేందుకు ఈ కల ఒక సూచికగా చెబుతుంటారు. అయితే చనిపోయిన వ్యక్తిని కలలో చూడటం: కలలో చనిపోయిన వ్యక్తిని చూసినట్లయితే.. అది శుభసూచకమే అంటున్నారు నిపుణులు. మరణించిన వ్యక్తులు మీ కలలో వచ్చినట్లయితే…మీకు మంచి జరుగుతుందని, మీకు ప్రియమైన వ్యక్తుల ఎదుగుదలకు సంకేతంగా చెబుతున్నారు.
లేదా మీరు బాధలో ఉన్నప్పుడు, సహాయం అవసరమైనప్పుడు కూడా ఇలాంటి కలలు వస్తాయి. మిమ్మల్ని వారితో తీసుకెళ్తున్నట్లు అనిపిస్తుంది. అలాగే కొన్ని కొన్ని సార్లు చనిపోయిన వ్యక్తి కలలో పదే పదే కనిపిస్తే అది శుభసూచకంగా పరిగణించబడదు. ఇది సమీప భవిష్యత్తులో కొన్ని పెద్ద ఇబ్బందులు సంభవించవచ్చనడానికి సంకేతంగా చెబుతున్నారు. రాబోయే రోజుల్లో మీరు జీవితంలో అపారమైన విజయాన్ని పొందుతారు. అయితే, ఇక్కడే మరో విషయం ఉంది.. అదేంటంటే..స్వప్నశాస్త్రం ప్రకారం..
మీకు కలలో చనిపోయిన వ్యక్తి కనిపిస్తే, ఆ వ్యక్తి మీకు చాలా ప్రత్యేకమని ఆ వ్యక్తితో మీకు చాలా అనుబంధం ఉందని అర్థం. కానీ, ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తి గురించి కలలుగన్నట్లయితే.. అది మంచిది కాదని చెబుతున్నారు.. ఎందుకంటే ఇలా చనిపోయిన వ్యక్తిని మళ్లీ మళ్లీ చూడటం కొన్ని పెద్ద ఇబ్బందులను సూచిస్తుందని చెబుతున్నారు. మీ కలలో మీరే చనిపోయినట్లు కలలు కనడం.. మీరు మీ కలలో చనిపోయినట్లు కనిపిస్తే, ఇది మంచి సంకేతంగా చెబుతున్నారు నిపుణులు. అలాంటి కల అంటే మీరు దీర్ఘాయుష్షు కలిగి ఉంటారని అర్థం అంటున్నారు.
జీవిత సమస్యలు తొలగిపోతాయని, మీరు త్వరలో కొన్ని గొప్ప వార్తలను వింటారని చెబుతున్నారు. మీ జీవితంలో జరుగుతున్న సమస్యలు త్వరలో ముగుస్తాయని అర్థం. ఈ కల భవిష్యత్తులో విజయాన్ని సూచిస్తుంది. మీ దివంగత తండ్రిని చూడటం: మీరు మీ దివంగత తండ్రిని కలలో చూసినట్లయితే, అది శుభప్రదమైన కల. మరణించిన తండ్రితో కలలో మాట్లాడటం లేదా ఆయనను చూడటం జీవితంలో శుభ మార్పులను సూచిస్తుంది. అలాంటి కలలు జీవితంలో ఆనందం రాకను సూచిస్తాయి. అలాంటి కలలు రావడం అంటే ఇంట్లో త్వరలో ఏదో ఒక వేడుక జరగనుంది అంటారు.