ప్రస్తుతం వైద్యరంగం అభివృద్ధి చెందుతుండటంతో.. ఇలాంటి చిక్కుముడులు నెమ్మదిగా విడుతున్నాయి. దాదాపు పదేళ్ల కిందట కొందరు సైంటిస్టులు ఎలకలపై పరిశోధనలు చేస్తున్నప్పుడు వాటి న్యూరో కెమికల్ ప్రాసెస్ ను గమనించారు. ఆ సమయంలో వాటి మైండ్ లో జరిగే మార్పులను శాస్త్రవేత్తలు.. ఎలకల్లో సెరోటోనిన్ రసాయనం ఎక్కువగా విడుదల కావడాన్ని గమనించారు.
అయితే మరణానికి కొన్ని క్షణాల ముందు మానవుడి మెదడులో ఏం జరుగుతుంది అనే రహస్యాన్ని ఇటీవలన ఓ అధ్యయనంలో శాస్త్రవేత్తలు తెలుసుకో గలిగారు. కాగా, ఇప్పుడు మనం ఒక వ్యక్తి మరణానికి దగ్గరగా వచ్చినప్పుడు ఆయన మదిలో కలిగే ఆలోచనలు, అతను ఏం ఆలోచిస్తాడో చూద్దాం. పరిశోధకులు ఒక మూర్చ రోగిని ఎలక్ట్రోఎన్స్ ఫలో గ్రామ్ రికార్డింగ్ ద్వారా పరీక్షించగా, ఆ సమయంలో అతనికి గుండెపోటు వచ్చిందంట.

అయితే ఆయన చనిపోవడానికి 15 నిమిషాల ముందు అతడి ఏం ఆలోచించాడు, అతని మెదడులో మెదిలిన ఆలోచనలు ఈజీజీ రికార్డ్ చేసిందంట. గామా డోలనాలు అని పిలవబడే నిర్ధిష్ట మెదడు తరంగ నమూనాను అది వెళ్లడించిందంట. దీని గురించి పరిశోధకులు మాట్లాడుతూ.. ఒక వ్యక్తి చనిపోవడానికి ముందు అతని మెదడు వెయ్యిరేట్లు చాలా యాక్టివ్‌గా పని చేసింది.
ముఖ్యంగా గుర్తుకు తెచ్చుకోవడం, కలలు, అన్ని చాలా త్వరగా జరిగిపోయాయి. ముఖ్యంగా వ్యక్తి చనిపోయే కొన్ని క్షణాల ముందు అతని తన చివరి క్షణాల్లో ఆనందకరమైన జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నట్లు తెలిపారు. డాక్టర్ అజ్మల్ జెమ్మార్ ప్రకారం.. వ్యక్తి చనిపోయే ముందు, దాని చివరి క్షణాలు చాలా ఎక్కువ వేగంతో పని చేసి, ఆనందకరమైన జ్ఞాపకాలను తిరిగి తెస్తుంది.
అది చూసి మేమే షాక్ అయ్యాం అని తెలిపారు. మంచి జ్ఞాపకాలను మాత్రమే అది గుర్తు తెస్తాయంట.