దావూద్ ఇబ్రహీం పిచ్చిగా ప్రేమించిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..? ఆమె కోసం ఏం చేశాడో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

ఒకానొక సమయంలో బాలీవుడ్ సెలబ్రిటీలకు, గ్యాంగ్‌స్టర్లకు మధ్య మంచి రిలేషన్ నడిచిందట. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సైతం ఓ హీరోయిన్ అంటే పడి చచ్చేవాడట. ఈ బ్యూటీ కోసం దావూద్ ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు. అయితే 1980 నుంచి రెండు దశాబ్దాల పాటు.. బాలీవుడ్ ను ఏలింది మందాకిని. వెండితెర తారగా వెలుగు వెలిగింది. బాలీవుడ్‌ లో నటి మందాకిని అంటే పడిచచ్చిపోయేవారు. తన అందచందాలతో అప్పటి కుర్రకారును ఓ ఊపుఊపేసి వదిలిపెట్టింది సీనియర్ బ్యూటీ. రామ్ తేరీ గంగా మైలీ తో బాలీవుడ్ లో కెరీర్‌ స్టార్ట్ చేసింది మందాకిని.. ఈసినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆమె అందం నటనకు ఫిదా అయిపోయి.. వరుస ఆఫర్లు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి.

ఎంత ఫాస్ట్ గా ఎదిగి.. స్టార్ గా మారిందో.. అంతే ఫాస్ట్ గా పతనం చెందింది ఆమె సినిమా కెరీర్. దానికి కారణం ఒక్క ఫోటో. అప్పట్లో నిర్మాతలు పీల్చి పిప్పిచేసేవాడు దావూద్ ఇబ్రహీం.కాని ఆయన మందాకిని అందానికి ముగ్ధుడైపోయాడు.. మందాకిని చూస్తే చాలు మత్తెక్కిపోయేవాడు. దాంతో ఆమెను పిచ్చిగా ప్రేమించాడు. చివరికి ఆమెను తన ప్రేమలో పడేశాడు. చాన్నాళ్లు కలిసి తిరిగారట. లివింగ్ రిలేషన్ లో ఉన్నారట. దాంతో మందాకిని కెరీర్ బాలీవుడ్ లో పడిపోతూ వచ్చింది. ఇద్దరి ఫోటోలు బయటకురావడంతో ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది. అంతే కాదు దావూద్ తో కలిసి మందానికి కూడా చట్ట వ్యతిరేక పనులు చేస్తుంది అని ఆరోపణలు చుట్టుముట్టాయి.

దాంతో ఆమెకు సినిమాల్లో అవకాశాలు తగ్గడం స్టార్ట్ అయ్యింది. క్రమంగా సినీ అవకాశాలు తగ్గడంతో మందాకిని కెరీర్ పాతాళానికి పడిపోయింది. దావూద్ సినిమా వాళ్లను హింసించడం.. అతనిపై ఉన్న నెగెటివిటీ కారణంగా నిర్మాతలు మందాకినికి సినిమాల్లో అవకాశం ఇవ్వడం మానేశారు. దీంతో మందాకినీ ఫిల్మ్ ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయ్యింది. ఫేమస్ డాక్టర్ కాగ్యూర్ రింపోచే ఠాకూర్ ను పెళ్లాడి దుబాయ్ లో సెటిల్ అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు కాగా వారి పేర్లు ఇనాయ, రబిల్.

అలా మందాకిని ప్రేమలో మునిగి తేలిన దావూద్ ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రి పాలయ్యాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని నిఘ వర్గాలు కూడా కన్ ఫార్మ్ చేశాయి. దావూద్‌ చాలా ఏళ్లుగా తనఫ్యామిలీతో పాటుగా పాకిస్తాన్‌లోనే ఉంటున్నాడు. అక్కడే స్థిరపడ్డాడు. అయితే అతను కరాచీలోనే ఉంటున్నట్టు పక్కా ఆధారాలున్నాయని భారత్‌ వెల్లడించింది. భారత్‌తో పాటు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 2003లోనే దావూద్‌ను మోస్ట్‌ వాంటెడ్‌ ఇంటర్నేషనల్ క్రిమినెల్ గా ప్రకటించింది. అంతే కాదు అతని తలపై ఏకంగా రెండున్నర కోట్ల కోట్ల డాలర్ల రివార్డ్ కూడా ఉంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *