కొన్ని తెగల వారు పాటించే రిలేషన్షిప్ రూల్స్ మరీ విచిత్రంగా అనిపిస్తాయి. ముఖ్యంగా ఒక చోట అయితే తండ్రి తన కూతుర్ని నిస్సిగ్గుగా పెళ్లి చేసుకుంటాడు. బంగ్లాదేశ్లో మండి తెగ ప్రజలు ఈ భయంకరమైన ఆచారం పాటిస్తుంటారు. అయితే బంగ్లాదేశ్ మండి తెగలో కొన్ని శతాబ్దాలుగా ఇలాంటి విచిత్రమైన ఆచారం కొనసాగుతూ వస్తోంది. కూతురు యుక్త వయసుకు వచ్చిన వెంటనే తండ్రి ఆమెకు భర్త అవుతాడు.
అంతేకాకుండా ఒక స్త్రీ పెళ్లి చేసుకున్న తర్వాత చిన్న వయసులోనే భర్త చనిపోయి వితంతువుగా మారితే అక్కడ మరో వ్యక్తి ఆమెని వివాహం చేసుకుంటాడు. ఈ పెళ్లిలో అతను తన భార్యగా అన్ని హక్కులను ఆమెకి ఇస్తాడు. అంతేకాకుండా వివాహం చేసుకున్న అమ్మాయికి ముందుగానే కూతురు పుట్టి ఉంటే కనుక..ఆమె యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఈ వ్యక్తి మళ్ళీ పెళ్లి చేసుకునే ఆచారం కూడా అక్కడ ఉంది.
అంటే ఈ తెగలో తండ్రి, కూతుర్ని పెళ్లి చేసుకునే ఆచారం చాలా ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తుందట. దీని గురించిన వార్తలు బయటకు రావడంతో నెటిజన్లు మండిపడుతూ ఘాటుగా స్పందిస్తున్నారు. ఇటీవల మండి కమ్యూనిటీకి చెందిన ఓరోలా అనే అమ్మాయి ఈ ఆశ్చర్యకరమైన నిజంపై తన ఆవేదనను పోస్ట్ చేసింది. తన తండ్రి చనిపోయిన తర్వాత తన తల్లి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందని చెప్పింది.
మొదట్లో అతనిని తన తండ్రి అని పిలిచిన ఒరోలా, ఆమె పెద్దయ్యాక అతనితో బలవంతంగా వివాహం చేశారు. ఈ వింత వైవాహిక సంప్రదాయానికి సంబంధించిన దారుణాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేయడంతో వార్త వైరల్గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.