రోడ్డు ప్రమాదంలో షైన్ తండ్రి సి.పి. చాకో మరణించారు. ఈ ఘటనలో షైన్, ఆయన తల్లి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం సేలం-బెంగళూరు జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆ వాహనంలో నటుడు, అతని సోదరుడు, తండ్రి, తల్లి, డ్రైవర్ ఉన్నారు. షైన్ కుటుంబం ఎర్నాకుళం నుండి బెంగళూరుకు వెళుతుండగా ముందు వెళ్తున్న లారీనీ కారు ఢీకొట్టింది.
అయితే శుక్రవారం తెల్లవారుజామున షైన్ టామ్ చాకో తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో ప్రయాణిస్తున్నారు. ఆయన తల్లిదండ్రులు, సోదరుడు మరియు డ్రైవర్‌తో కలిసి వారు ప్రయాణిస్తుండగా, తమిళనాడులోని ధర్మపురి సమీపంలో సేలం-బెంగళూరు జాతీయ రహదారిపై వారి వాహనం ప్రమాదానికి గురైంది. వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న ఒక లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదం చాలా తీవ్రంగా జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న ఐదుగురిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, తీవ్ర గాయాలపాలైన సి.పి. చాకో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఈ దురదృష్టకర సంఘటన గురించి తెలిసిన మలయాళ చిత్ర పరిశ్రమ ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, షైన్ టామ్ చాకో కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. షైన్ టామ్ చాకో, ఆయన కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిపై తదుపరి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Tragedy Strikes #ShineTomChacko’s Family in Road Accident
— Milagro Movies (@MilagroMovies) June 6, 2025
Malayalam actor Shine Tom Chacko met with a road accident in Tamil Nadu. His father C.P. Chacko passed away, while Shine, his mother, brother & driver were injured. He was recently seen in #Dasara, #Devara, and #Dacoit… pic.twitter.com/qLbMFnSjJt