చిన్న హీరోయిన్‌తో సీనియర్ హీరో సీక్రెట్ ఎఫైర్, విషయం భార్యకు తెలియడంతో..?

divyaamedia@gmail.com
2 Min Read

సీనియర్ హీరో ధర్మేంద్ర.. కెరీర్​ తొలినాళ్లలో ఆఫర్లు దొరక్క సపోర్టింగ్​ రోల్స్​కు పరిమితమైన ఈ స్టార్ హీరో, ఆ తర్వాత తన నటనతో హీరోగా నటించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. క్రమ క్రమంగా ఇండస్ట్రీలో ఎదిగారు. ఆయన ఇప్పటివరకు 300 కంటే ఎక్కువ చిత్రాలలో నటించారు. అయితే ధర్మేంద్ర సినిమాల్లోకి రాకముందే 1954లో ప్రకాష్ కౌర్‌ను పెళ్లి చేసుకున్నారు. 1980లో హేమా మాలినిని రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పట్లో తనకు జోడీగా నటించి హిట్లు కొట్టిన పాపులర్ హీరోయిన్‌ అనితా రాజ్‌పై ధర్మేంద్ర మనసు పారేసుకున్నారు.

దీంతో హేమామాలిని కాస్త ఇబ్బంది పడింది. హిట్ పెయిర్‌.. అనితా రాజ్ 1981లో రాజ్ బబ్బర్‌కు జోడీగా నటించిన ప్రేమ్ గీత్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. సుదేష్ ఇస్సార్ తీసిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. హీరోయిన్‌గా నౌకర్ బివి కా, గులామి, మజ్లూమ్, జమీన్ ఆస్మాన్, జరా సి జిందగీ.. ఇలా ఎన్నో హిట్లు తన ఖాతాలో వేసుకుంది. 80ల్లో పాపులర్ హీరోలు అందరితో కలిసి నటించింది.

అయితే ధర్మేంద్రతో ఆమె ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయింది. వీరిద్దరిదీ అప్పట్లో హిట్ పెయిర్‌. ధర్మేంద్ర, అనితా రాజ్ 1983లో వచ్చిన సూపర్ హిట్ సినిమా నౌకర్ బివి కాలో మొదటిసారి కలిసి నటించారు. ఇందులో వీరిద్దరూ భార్యాభర్తలుగా నటించారు. వారి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే అప్పటికే ధర్మేంద్ర, ఈ సినిమా తర్వాత అనితపై మనసు పడ్డాడని టాక్ నడిచింది.

వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఏకంగా 27 ఏళ్లు ఉన్నా, ఇద్దరూ రిలేషన్‌షిప్ నడిపించారని అప్పట్లో టాక్ నడిచింది. తర్వాత ఈ విషయం హేమా మాలినికి తెలిసింది. దీంతో అనితకు దూరంగా ఉండమని ధర్మేంద్రకు హేమా మాలిని వార్నింగ్ ఇచ్చిందట. తర్వాత భార్య చెప్పిన మాట విన్న ‘హీ-మ్యాన్’, అనితను దూరం పెట్టాడు. కానీ ఇద్దరి మధ్య ప్రొఫెషనల్ రిలేషన్‌షిప్ మాత్రం కంటిన్యూ అయింది. ధర్మేంద్ర-అనితా రాజ్ జంట ఆ దశాబ్దంలో పాపులర్ హిట్ పెయిర్‌గా నిలిచింది.

80ల్లో అనితా రాజ్ హిందీ సినిమాల్లో టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో అందరు పెద్ద హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఏ రోల్ ఇచ్చినా దాంట్లో జీవించడం ఆమెకు అలవాటు. 1984లో ఏడు సినిమాలు, 1985లో తొమ్మిది సినిమాలు, 1986లో పది సినిమాలు, 1988లో కూడా పది సినిమాలు చేసిందంటే.. అప్పట్లో ఆమె ఎంత బిజీగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. 1986లో అనితా రాజ్ సినిమా దర్శకుడు సునీల్ హింగోరానిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. లాంగ్ గ్యాప్ తర్వాత టీవీ సీరియల్స్‌తో రీఎంట్రీ ఇచ్చింది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *